Marnus Labuschagne: పాపం లబుషేన్.. రెస్ట్ తీసుకుందామనుకుంటే.. సిరాజ్ చెడగొట్టాడు.. వీడియో
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC Final) ఫైనల్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మూడో రోజు ఆటలో చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Marnus Labuschagne
Labuschagne: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC Final) ఫైనల్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మూడో రోజు ఆటలో చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు ఫన్నీగా కామెంట్లు చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజాలు ఓపెనర్లుగా వచ్చారు. కాగా.. ఉదయం నుంచి ఫీల్డింగ్ చేయడం వలన అలసిపోయేడా ఏమో తెలీదు గానీ డ్రెస్సింగ్ రూమ్‌లో లబుషేక్ రిలాక్స్ అవుతున్నాడు.
Ravindra Jadeja: 93 సెకన్లలోనే ఓవర్ పూర్తి.. బిషన్ సింగ్ బేడీ రికార్డు బ్రేక్
ఓపెనర్లు ఇద్దరిలో ఎవరు ఔటైనా సరే వన్ డౌన్‌గా లబుషేన్ బరిలోకి దిగాలి. ఓపెనర్లపై నమ్మకమో, టెస్టు మ్యాచ్ కదా తొందరగా వికెట్ పడదని అనుకున్నాడో ఏమో తెలీదు గానీ తాను కూర్చున్న కుర్చీలోనే కళ్లు మూసుకుని చిన్న కునుకు తీద్దామని బావించాడు. ఇలా అతడు కళ్లు మూసుకుని కునుకు తీయడం ప్రారంభించాడో లేదో మైదానంలో వార్నర్‌ను సిరాజ్ ఔట్ చేశాడు. అదే సమయంలో కెమెరాలు లబుషేన్‌పై ఫోకస్ పెట్టాయి.
View this post on Instagram
WTC Final 2023: పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా.. ఆధిక్యం 296 పరుగులు.. టీమ్ఇండియాకు కష్టమే..!
ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోని మూడో బంతికి వార్నర్ ఔట్ అయ్యాడు. ప్రేక్షకుల గోలకు నిద్ర కళ్లతోనే చూసిన లబుషేన్.. వార్నర్ ఔట్ అయ్యాడని గమనించి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. వెంటనే బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వచ్చేశాడు. పాపం కాసేపు విశ్రాంతి తీసుకోవాలని బావించిన లబుషేన్‌కు నిరాశ తప్పలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.