కివీస్ గడ్డపై సచిన్ రికార్డుకు చేరువలోనున్న ధోనీ
ధోనీ పని ఇక అయిపోయింది రిటైర్మెంట్ తీసుకోవడమే కరెక్ట్ అని. సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలు సైతం అంతర్జాతీయ క్రికెట్‌లు ఆడటం మానేసి దేశీవాలీ క్రికెట్‌లు ఆడాలంటూ సూక్తులు చెప్పుకొచ్చారు. కానీ కేవలం ఆస్ట్రేలియా పర్యటనతో వాటన్నిటికీ ధీటుగా బదులిచ్చాడు ధోనీ.

ధోనీ పని ఇక అయిపోయింది రిటైర్మెంట్ తీసుకోవడమే కరెక్ట్ అని. సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలు సైతం అంతర్జాతీయ క్రికెట్‌లు ఆడటం మానేసి దేశీవాలీ క్రికెట్‌లు ఆడాలంటూ సూక్తులు చెప్పుకొచ్చారు. కానీ కేవలం ఆస్ట్రేలియా పర్యటనతో వాటన్నిటికీ ధీటుగా బదులిచ్చాడు ధోనీ.
వరుస విమర్శలు.. ధోనీ పని ఇక అయిపోయింది రిటైర్మెంట్ తీసుకోవడమే కరెక్ట్ అని. సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలు సైతం అంతర్జాతీయ క్రికెట్‌లు ఆడటం మానేసి దేశీవాలీ క్రికెట్‌లు ఆడాలంటూ సూక్తులు చెప్పుకొచ్చారు. కానీ కేవలం ఆస్ట్రేలియా పర్యటనతో వాటన్నిటికీ ధీటుగా బదులిచ్చాడు ధోనీ. 2018లో 20 ఇన్నింగ్సుల్లో కేవలం 275 పరుగులు మాత్రమే చేసిన ధోనీ 2019 వచ్చేసరికి పూర్తిగా కొత్త ఆటను చూపించాడు. మూడు వన్డేలు ఆడి వరుస హాఫ్ సెంచరీలను హ్యాట్రిక్‌లుగా మలచిన టీమిండియా కెప్టెన్ భారత్‌కు విజయాన్ని తెచ్చిపెట్టడంలో కీలకమైయ్యాడు. ధోనీని తిట్టిన నోళ్లే ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి.
ఆస్ట్రేలియా పర్యటనలో కేవలం వన్డే సిరీస్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. మిస్టర్ కూల్‌గా పేరున్న ధోని విమర్శలకు నోటితో కాకుండా ఆటతో సమాధానమిచ్చిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ జనవరి 23 నుంచి ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించేందుకు ధోనీ ఎదురుచూస్తున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోనీ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. 18 మ్యాచ్‌ల్లో 652 పరుగులతో సచిన్ అగ్రస్థానంలో ఉండగా, వీరేంద్ర సెహ్వాగ్ 12 మ్యాచ్‌ల్లో 598 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ గడ్డపై సచిన్ రికార్డు చేరుకోవాలంటే ధోనీ ఇంకా 197 పరుగుల చేయాల్సి ఉంది. మళ్లీ ఫామ్ అందుకున్న ధోనీ రికార్డు అందుకుని విదేశీ పర్యటనను విజయవంతం కావాలని అభిమానులు ఆశపడుతున్నారు.