ధోనీకి మోడీ కాంప్లిమెంట్.. ఇదే కదా కోరుకుందంటోన్న మహీ

ధోనీకి మోడీ కాంప్లిమెంట్.. ఇదే కదా కోరుకుందంటోన్న మహీ

Updated On : August 20, 2020 / 4:38 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. కాంప్లిమెంట్ ఇస్తూ రాసిన లెటర్ కు ధోనీ కూడా ప్రత్యేకంగా స్పందించారు. ‘ఓ కళాకారుడు, సైనికుడు, క్రీడాకారుడికి ప్రశంసకు మించి కావాల్సిందేముంటుంది. వారి త్యాగాలు, కఠోర శ్రమను గుర్తించి ప్రశంసిస్తున్నారు. మీ ప్రశంసలకు ప్రధాని నరేంద్ర మోడీకి థ్యాంక్స్’ అంటూ ప్రధాని నుంచి వచ్చిన లెటర్ ను పోస్టులో షేర్ చేశాడు.

మహీ అంటే కేవలం గణాంకాలు, మ్యాచ్ రికార్డ్‌లుగా గుర్తించుకోవడం కరెక్ట్ కాదు. అతడ్ని కేవలం ఒక క్రీడాకారుడిగా చూడటం కూడా తగదు. క్రికెటర్‌గానే కాకుండా తండ్రిగా కూడా జీవాతో ధోనీకి ఉన్న అనుబంధం ప్రత్యేకమని మోడీ ప్రస్తావించారు.

గత శనివారం ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌‌ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఏ ప్రెస్ మీట్ హడావుడి లేకుండా సోషల్ మీడియాలోనే ప్రకటించేశాడు ధోనీ. కెప్టెన్‌గా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా అందించిన ధోనీ.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారి టీమిండియాని నెం.1 స్థానంలో నిలిపాడు. ఐసీసీ మూడు ట్రోఫీలను అందుకున్న ఏకైక కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు.

2011 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాని విజేతగా నిలిపిన తర్వాత మహేంద్రసింగ్ ధోనీకి ఆర్మీలో లెప్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదా లభించింది. ఆ తర్వాత ఆర్మీతో కలిసి కఠిన శిక్షణ తీసుకున్న ధోనీ.. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత రెండు వారాలు ఆర్మీతో కలిసి పనిచేశాడు.