సిక్సుల సీక్రెట్ చెప్పేసిన పంత్..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ కెరటం విజృంభించాడు. భారీ షాట్‌లు సంధించి విజయాన్ని చేరువ చేశాడు. (49; 21 బంతుల్లో 5సిక్సులు, 2బౌండరీలు)తో చెలరేగాడు. తీవ్రంగా ఒత్తిడి పెరిగిన ఓవర్లో 4, 6, 4, 6బాది అమాంతం టార్గెట్ దూరాన్ని తగ్గించేశాడు. మ్యాచ్ విజయానంతరం మీడియాతో మాట్లాడిన పంత్ సిక్సుల వెనుక సీక్రెట్ చెప్పేశాడు.
‘టీ20 ఫార్మాట్‌లో 20 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి వచ్చినపుడు బౌలర్‌పై దాడి చేయాలి. పరుగులు రాబట్టాలనే ఆలోచనలో బౌలర్ ఎవరని చూడకుండా బాదుతా. భారీ సిక్సర్లు నా కండ బలంతోనే కొట్టగలుగుతున్నా. నెట్స్‌లో కూడా బాగా ప్రాక్టీస్ చేస్తా’ అని సిక్సుల సీక్రెట్ పంత్ బయటపెట్టేశాడు.
‘బుధవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం నా తీరుకు బిన్నంగా ఆడా. బలంగా బాదడమే కాకుండా.. బంతిని బట్టి ఆడాలని ప్రయత్నించాను. అంతకష్టపడి పరుగులు సాధించి ఢిల్లీని విజయాన్ని దగ్గరగా తీసుకెళ్లగలిగా. కానీ, ఇన్నింగ్స్ ఫినిష్ చేయలేకపోయా. తర్వాతి మ్యాచ్‌లో ఫినిష్ చేస్తా. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను’ అని పంత్ వెల్లడించాడు.