వరల్డ్ కప్ ముంగిట రోహిత్ శర్మకు గాయం
ఐపీఎల్ అంటేనే పోరాటం. షార్ట్ ఫార్మాట్‌లో ఫలితాలు ఒక్క ఓవర్లో మారిపోతుంటాయి. అందుకోసం ప్లేయర్లు చేసే ఫీట్‌లు అంతాఇంతా కాదు.

ఐపీఎల్ అంటేనే పోరాటం. షార్ట్ ఫార్మాట్‌లో ఫలితాలు ఒక్క ఓవర్లో మారిపోతుంటాయి. అందుకోసం ప్లేయర్లు చేసే ఫీట్‌లు అంతాఇంతా కాదు.
ఐపీఎల్ అంటేనే పోరాటం. షార్ట్ ఫార్మాట్‌లో ఫలితాలు ఒక్క ఓవర్లో మారిపోతుంటాయి. అందుకోసం ప్లేయర్లు చేసే ఫీట్‌లు అంతాఇంతా కాదు. పైగా కొన్ని జట్లు ఫలితాలు రాబట్టడంలో తడబడుతూనే పోరాటం కొనసాగిస్తున్నాయి. ఇటువంటి వాటిలో ఒకటైన ముంబై ఇండియన్స్ బుధవారం జరగనున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్ కోసం తీవ్రంగా కష్టపడింది.
Read Also : తెలుసుకోండి : పోలింగ్ బూత్ లోకి వీటికి అనుమతి లేదు
ఈ క్రమంలోనే ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భుజానికి గాయమైంది. వైద్యుల సూచన మేరకు బ్యాటింగ్ చేసేందుకు కొద్దిపాటి విశ్రాంతి తీసుకోమని వైద్య బృందం తెలిపింది. మంగళవారం ఉదయం గాయం కారణంగా ప్రాక్టీస్ నుంచి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన రోహిత్ శర్మ తిరిగి మైదనాంలోకి రాలేదు.
వరల్డ్ కప్‌కు ముందు జరగుతున్న లీగ్ కావడంతో గాయాల బెడద ఉంటే ప్రపంచ కప్ టోర్నీలో ఆడటం కష్టమని అనుమానాలు ముందుగానే వ్యక్తమయ్యాయి. లీగ్ ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో జస్ప్రిత్ బుమ్రా గాయానికి గురి కావడంతో తిరిగి కోలుకోవడంపై ఆశలు వదులుకున్నారంతా. కానీ, అభిమానుల కోసం, త్వరగానే కోలుకుని మళ్లీ బరిలోకి దిగాడు.
Read Also : ఎయిర్ పోర్టులో నేలమీదే నిద్రపోయిన ధోనీ దంపతులు