RR vs RCB: మ్యాచ్ గెలిచేదెవరు.. బోణీ కొట్టేదెవరు.. ?
ఐపీఎల్ 2019 సీజన్‌లో రసవత్తర పోరుకు జైపూర్ వేదిక కానుంది. సీజన్ ఆరంభమై పదిరోజులు గడిచినా కూడా గెలుపు రుచి చూడని ఇరు జట్లు 02 మార్చి 2019న తొలి విజయం కోసం పోరాడనున్నాయి.

ఐపీఎల్ 2019 సీజన్‌లో రసవత్తర పోరుకు జైపూర్ వేదిక కానుంది. సీజన్ ఆరంభమై పదిరోజులు గడిచినా కూడా గెలుపు రుచి చూడని ఇరు జట్లు 02 మార్చి 2019న తొలి విజయం కోసం పోరాడనున్నాయి.
ఐపీఎల్ 2019 సీజన్‌లో రసవత్తర పోరుకు జైపూర్ వేదిక కానుంది. సీజన్ ఆరంభమై పదిరోజులు గడిచినా కూడా గెలుపు రుచి చూడని ఇరు జట్లు 02 ఏప్రిల్ 2019న తొలి విజయం కోసం పోరాడనున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మంగళవారం రాత్రి 8 గంటలకి మ్యాచ్ జరగనుంది. టోర్నీ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో బెంగళూరు జట్టు మూడు మ్యాచ్‌ల్లోనూ నిరాశపచగా.. గెలుపు ముంగిట రాజస్థాన్ బోర్లాపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో.. కనీసం ఈరోజైనా మ్యాచ్‌లో గెలిచి బోణి కొట్టాలని రెండు జట్లూ ఆశిస్తున్నాయి.
Read Also : RR vs RCB: మ్యాచ్ గెలిచేదెవరు.. బోణీ కొట్టేదెవరు.. ?
టోర్నీ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దెబ్బకి 7 వికెట్ల తేడాతో ఓడిన బెంగళూరు.. ఆ తర్వాత ముంబైతో మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు కనిపించినా.. ఆఖర్లో తడబడి విజయానికి దూరమైంది. ఇక ఇటీవల హైదరాబాద్ జరిగిన మ్యాచ్‌లో మరీ ఘోరంగా 118 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి పూర్తి నిరాశలో కూరుకుపోయింది. ముఖ్యంగా.. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తుండగా.. ఏబీ డివిలియర్స్ నిలకడగా రాణించలేకపోతున్నాడు. మరోవైపు బౌలింగ్‌లోనూ ఆశించనంత మేర ఆకట్టులేకపోవడంతో పరాజయాలు వెన్నంటుతున్నాయి. చాహల్ మెరుస్తున్నా.. ఉమేశ్ యాదవ్, గ్రాండ్ హోమ్, సిరాజ్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే తప్ప బెంగళూరు గాడిన పడే అవకాశాలు కనిపించడం లేదు.
రాజస్థాన్ రాయల్స్‌ది అదే పరిస్థితి. టోర్నీలో తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచేలా కనిపించి.. అశ్విన్ మాన్కడింగ్ రనౌట్ కారణంగా.. ఆఖర్లో ఒత్తిడికి గురై 14 పరుగుల తేడాతో విజయాన్ని దూరం చేసుకుంది. ఆ తర్వాత హైదరాబాద్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిన రాజస్థాన్.. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌పైనా అదే ఫలితాన్ని పునరావృతం చేసుకుంది. చివర్లో డ్వేన్ బ్రావో.. బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంతో 8 పరుగుల తేడాతో ఓటమికి గురైంది. ఓపెనర్ జోస్ బట్లర్ నిలకడలేమీ జట్టుని దెబ్బతీస్తుండగా.. కెప్టెన్ అజింక్య రహానె, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ మాత్రమే రాణించినా ప్రయోజనం కనిపించడం లేదు. స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, గౌతమ్, రాహుల్ త్రిపాఠి ఇంకా లయ అందుకోవాల్సి ఉంది. బ్యాటింగ్‌తో కంటే.. రాజస్థాన్ బౌలింగ్‌లో బలంగా కనిపిస్తోంది.
Read Also : బిగ్ బ్రేకింగ్ : మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్ష