Mauka : వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్ చేరాలి, మరోసారి పాకిస్తానే గెలవాలి
'మౌకా' అనే పదంతో ఇంకెంత మాత్రం పాకిస్తాన్ ను ఎద్దేవా చేయలేరు. సరదా కోసం ఓ దేశాన్ని కించపరుస్తారా? 'మౌకా' అనేది వినోదం ఎంతమాత్రం కాదు...

Mauka
Mauka : వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్ పై భారత్ దే పైచేయి అని తెలిసిందే. అన్ని రకాల వరల్డ్ కప్ లలో దాయాదులు 13 సార్లు తలపడగా, 12 సార్లు భారత్ గెలిస్తే, మొన్న తొలిసారిగా పాక్ గెలిచింది. కాగా, పాక్ పై భారత్ రికార్డును దృష్టిలో ఉంచుకుని క్రికెట్ మ్యాచ్ ల ప్రసారకర్తలు కొంతకాలంగా ‘మౌకా మౌకా’ పేరిట వాణిజ్య ప్రకటనలు రూపొందిస్తున్నారు. ఈ యాడ్స్ దాదాపుగా పాక్ వర్గాలను హేళన చేస్తున్న రీతిలోనే ఉంటాయన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘మౌకా’ అనే పదంతో ఇంకెంత మాత్రం పాకిస్తాన్ ను ఎద్దేవా చేయలేరని చెప్పాడు. సరదా కోసం ఓ దేశాన్ని కించపరుస్తారా? అంటూ షోయబ్ ప్రశ్నించాడు. ‘మౌకా’ అనేది వినోదం ఎంతమాత్రం కాదని అన్నాడు. తమది గర్వకారణమైన దేశం అని అక్తర్ చెప్పుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ కు టీమిండియా అర్హత సాధించాలని, అక్కడ మరోసారి పాకిస్తానే గెలవాలని కోరుకుంటున్నట్టు అక్తర్ తెలిపాడు. భారత్ తమకు మరో మౌకా ఇవ్వాలంటూ వ్యంగ్యం ప్రదర్శించాడు. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్-టీమిండియా ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించాడు.
CIBIL Score : మీకు సిబిల్ స్కోరు లేదా? అయినా రుణం తీసుకోవచ్చా? ఎలానంటే?
”మౌకా యాడ్ ను ఇక ఎంతమాత్రము ఫన్నీగా తీసుకోలేము. ఎందుకంటే అది దేశ సెంటిమెంట్ ను హర్ట్ చేస్తుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ తో ఫైనల్స్ ఆడేందుకు ఎదురుచూస్తున్నా. అక్కడా మరోసారి కోహ్లీసేనను ఓడించాలని ఉంది. అందుకోసం భారత్ ఫైనల్స్‌కు రావాలని కోరుకుంటున్నా” అని తన యూట్యూబ్ వీడియోలో అక్తర్ అన్నాడు.
2015 వన్డే వరల్డ్ కప్ లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కి ముందు మౌకా మౌకా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. కొన్నేళ్లుగా ఈ యాడ్ అందరినీ ఆకర్షిస్తోంది. కాగా, ఎట్టకేలకు వరల్డ్ కప్ లో భారత్ విజయాల పరంపరంకు పాకిస్తాన్ అడ్డుకట్ట వేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా టీ20 వరల్డ్ కప్ 2021 బరిలోకి దిగిన పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి భారత్ ను ఓడించింది.
Offline Whatsapp Trick: ఈ ట్రిక్‌తో ఇంటర్నెట్ ఆఫ్ చేయకుండానే.. మీ వాట్సాప్ ఆఫ్‌లైన్ చేయొచ్చు..!
ఇక, అప్ఘానిస్తాన్ పై భారత్ గెలుపొందడంతో చాలామంది పాక్ అభిమానులు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై స్పందించిన అక్తర్.. ఇందులో అనవసరంగా అప్ఘానిస్తాన్ ను నిందించరాదని కోరాడు. ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఇప్పుడిలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ జట్టుకు ప్రమాదకరమని హెచ్చరించాడు. అప్ఘాన్ బలమైన జట్టు కాదని, బలమైన భారత్ తో పోటీపడిందని అక్తర్ అన్నాడు.