T20 World Cup : చరిత్ర సృష్టించిన నమీబియా… సూపర్ -12కు అర్హత

టీ 20 వరల్డ్ కప్ 2021లో నమీబియా చరిత్ర సృష్టించింది. ఆడుతున్న తొలి టీ20 ప్రపంచకప్‌లోనే సూపర్‌ 12 దశకు అర్హత సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా షార్జాలో ఐర్లాండ్, నమీబియా జట్లు తలపడ్డాయి

T20 World Cup : చరిత్ర సృష్టించిన నమీబియా… సూపర్ -12కు అర్హత

T20 World Cup Namibia

Updated On : October 22, 2021 / 11:10 PM IST

T20 World Cup : టీ 20 వరల్డ్ కప్ 2021లో నమీబియా చరిత్ర సృష్టించింది. ఆడుతున్న తొలి టీ20 ప్రపంచకప్‌లోనే సూపర్‌ 12 దశకు అర్హత సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా షార్జాలో ఐర్లాండ్, నమీబియా జట్లు తలపడ్డాయి. ఈ పోరులో అద్భుత విజయం సాధించిన నమీబియా సూపర్-12 దశకు చేరుకుంది.

టాస్ గెలిచిన ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరు సాధించాలన్న ఐర్లాండ్ ఆశలు నెరవేరలేదు. ఓపెనర్లు స్టిర్లింగ్ 38, కెవిన్ ఓబ్రియాన్ 25 పరుగులు చేయగా, కెప్టెన్ బాల్ బిర్నీ 21 పరుగులు సాధించాడు. మిగిలిన ఆటగాళ్లు విఫలం కావడంతో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులే చేసింది. నమీబియా బౌలర్లలో జాన్ ఫ్రైలింక్ 3, వీజ్ 2 వికెట్లు, స్మిట్, స్కోల్జ్ తలో వికెట్ తీశారు.

Soaps: మీరు వాడుతున్న సబ్బు మంచిదేనా?

లక్ష్యఛేదనలో నమీబియా జట్టు 18.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసి విక్టరీ కొట్టింది. కెప్టెన్‌ ఎరాస్మస్‌ 53 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. చివర్లో డేవిడ్‌ వీస్‌(28 నాటౌట్) తన మెరుపులతో అలరించాడు. నమీబియా ఓపెనర్లు క్రెగ్ విలియమ్స్ 15, జేన్ గ్రీన్ 24 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ కాంఫర్ 2 వికెట్లు తీశాడు.

Urine : మూత్రం ఎక్కువ సేపు ఆపుకుంటే?

శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌ను ఓటమితో ప్రారంభించిన నమీబియా అండర్‌డాగ్స్‌గా కనిపించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్‌కు షాక్‌ ఇస్తూ నమీబియా అద్బుత విజయాన్ని అందుకుంది. ఎలాగైనా సూపర్‌ 12 దశకు అర్హత సాధించాలని ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను కీలకంగా తీసుకుంది. తొలుత ఐర్లాండ్‌ను 125 పరుగులకే కట్టడి చేసిన నమీబియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో అదరగొట్టింది. సూపర్‌ 12కు అర్హత సాధించామని తెలియగానే నమీబీయా ఆటగాళ్లు ఆనందలో మునిగిపోయారు.