T20 World Cup: పదేళ్ల క్రితం విరాట్ కోహ్లీ వేసిన ట్వీట్ వైరల్.. ఐఫోన్ రోజులొచ్చినా మారలేదు

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.

T20 World Cup: పదేళ్ల క్రితం విరాట్ కోహ్లీ వేసిన ట్వీట్ వైరల్.. ఐఫోన్ రోజులొచ్చినా మారలేదు

Virat

Updated On : November 1, 2021 / 4:20 PM IST

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్ల ఆట నిరాశపరచగా.. ఆదివారం రాత్రి న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత టీమ్ ఇండియా స్వదేశానికి తిరిగి రావడం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. దీంతో భారత క్రికెట్ అభిమానులు కోహ్లీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో యూజర్లు టీమ్ ఇండియా ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా.. ముఖ్యంగా విరాట్ కోహ్లీని టార్గెట్ చేశారు. విరాట్ కోహ్లీ పాత ట్వీట్‌ని, పదేళ్ల తర్వాత బయటకు తీసుకుని వచ్చి మరీ ట్రోల్ చేస్తున్నారు. 23 జనవరి 2011న చేసిన ట్వీట్‌ని పదేళ్ల తర్వాత ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్వీట్‌లో కోహ్లి.. ‘ఓటమితో బాధపడుతూ.. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను’ అని రాసి ఉంది.

అప్పట్లో సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన తర్వాత కోహ్లీ ఈ ట్వీట్ చేశాడు. 23 జనవరి 2011న, ODI సిరీస్‌లో చివరి మ్యాచ్‌ను 33 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 3-2తో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది.

అయితే, ఇప్పుడు అదే ట్వీట్‌ని ట్రోల్ చేస్తూ.. విరాట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ ట్విట్టర్ యూజర్ విరాట్‌ను జోఫ్రా ఆర్చర్‌గా అభివర్ణించారు. ఆర్చర్ గతంలో చేసిన ట్వీట్లు వైరల్ అవుతూ ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు కోహ్లీ ట్వీట్ వైరల్ అవుతుంది.

బ్లాక్ బెర్రీ నుంచి ఐఫోన్ రోజులకు వచ్చేశాం.. ఎంతో మారిపోయాయాం కానీ, నీ ఓటమి మాత్రం మారలేదు.. అంటూ కోహ్లీపై మరో నెటిజన్ విమర్శ చేశారు.

మరో ట్విట్టర్ యూజర్.. హాలోవీన్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం త్వరగా వచ్చేస్తున్నారు అంటూ రాసుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ క్రికెట్ బాగా ఆడాలి.. దీపావళి సెలబ్రేషన్స్ టిప్స్ ఇవ్వడం కాదు అని మరో ట్విట్టర్ యూజర్ రాసుకొచ్చారు.

యాడ్ షూట్ చెయ్యడానికి టైమ్ అయ్యింది.. అందుకే త్వరగా వస్తున్నాడు అని మరో యూజర్ రాసుకొచ్చారు.