Slap Kabaddi : ఇదెక్క‌డి ఆట‌రా బాబు.. చెంప‌లు బూరెల్లా ఉబ్బ‌డం ఖాయం.. స్లాప్ క‌బ‌డ్డీ అంటా.. వీడియో వైర‌ల్

క‌బడ్డీ ఆట గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. దాదాపు అంద‌రికి తెలిసే ఉంటుంది. మ‌న పొరుగుదేశ‌మైన పాకిస్థాన్‌లో మాత్రం చాలా వైర‌టీగా ఆడుతారు.

Slap Kabaddi : ఇదెక్క‌డి ఆట‌రా బాబు.. చెంప‌లు బూరెల్లా ఉబ్బ‌డం ఖాయం.. స్లాప్ క‌బ‌డ్డీ అంటా.. వీడియో వైర‌ల్

Slap Kabaddi

Updated On : July 5, 2023 / 9:44 PM IST

Pakistan Slap Kabaddi : క‌బడ్డీ ఆట గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. దాదాపు అంద‌రికి తెలిసే ఉంటుంది. మ‌న దేశంలోనే కాకుండా ఇత‌ర దేశాల్లో సైతం ఈ ఆట‌ను ఆడుతారు. అన్ని దేశాల్లో ఎలా ఆడినా స‌రే మ‌న పొరుగుదేశ‌మైన పాకిస్థాన్‌లో మాత్రం చాలా వైర‌టీగా ఆడుతారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

సాధార‌ణంగా క‌బ‌డ్డీ ఆట‌లో ఏడుగురు ఆట‌గాళ్లు ఉంటారు అన్న సంగ‌తి తెలిసిందే. విన‌డానికి కొంచెం ఆశ్చ‌ర్యం క‌లిగించినా ఇక్క‌డ మాత్రం ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య మాత్ర‌మే జ‌రుగుతుంది. దీనికి త‌ప్ప‌డ్ లేదా స్లాప్ క‌బ‌డ్డీ అని అంటారు. ముందుగా కూత‌తోనే ఆట ప్రారంభ‌మ‌వుతుంది. ఆ త‌రువాత ఒక‌రినొక‌రు చెంప దెబ్బ‌లు కొడుతుంటారు. దీని ద్వారా పాయింట్లు సాధిస్తారు.

Ashes : లెజెండ్ పై వేటు.. ఐదు వికెట్లు తీసినా యువ ఆట‌గాడికి నో ఛాన్స్‌.. మూడో టెస్టుకు ఇంగ్లాండ్‌..

ఇలా ఓడిపోయేంత వ‌ర‌కు చెంప‌దెబ్బ‌లు కొడుతూనే ఉంటారు. పంచ్‌లు ఇస్తే మాత్రం ఫౌల్‌గా ప‌రిగ‌ణిస్తారు. ఈ గేమ్ చూడ‌డానికి చాలా ఫ‌న్నీగా ఉంటుంది. మ్యాచ్ ను చూడ‌డానికి వ‌చ్చిన ప్రేక్ష‌కుల నుంచే న‌గ‌దును క‌లెక్ట్ చేసి విజేత‌కు ఇస్తారు.


Virat Kohli Reverse Sweep : కోహ్లి ఇలాంటి షాట్లు ఆడడం ఎప్పుడు చూసి ఉండ‌రు.. వీడియో వైర‌ల్‌

పాక్‌కు చెందిన స్లాప్ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ మీడియాతో మాట్లాడుతూ.. స్లాప్ క‌బ‌డ్డీకి పాక్‌లో ఎంతో ఆద‌ర‌ణ ఉంటుందని, ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య ఆట జ‌రుగుతుంద‌న్నాడు. ఒక ఆట‌గాడు కొట్ట‌డం ద్వారా పాయింట్‌ను సాధిస్తాడని, మ‌రో ఆట‌గాడు ప్ర‌త్య‌ర్థికి పాయింట్ కోల్పోకుండా కాపాడుకుంటాడని తెలిపాడు. పంచ్‌ల‌ను ఫౌల్‌లు ప‌రిగ‌ణిస్తారని, ఓ ఆట‌గాడు ప్ర‌త్య‌ర్థి ఆట‌గాడిని ఎన్ని సార్లైనా కొట్ట‌వ‌చ్చున‌ని చెప్పాడు. ఆట‌గాళ్లు గాయ ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తార‌ని తెలిపాడు. చివ‌ర‌గా మ్యాచ్ చూసేందుకు వ‌చ్చిన వారి నుంచి వ‌చ్చే డ‌బ్బునే గెలిచిన వారికి ఇస్తార‌ని అన్నాడు.