Yuvraj Singh : ఆల్‪టైమ్ ఎలెవ‌న్‌ను ప్ర‌క‌టించిన యువ‌రాజ్‌.. ధోనీకి నో ఛాన్స్..

యువీ త‌న ఆల్‌టైమ్ ఎలెవ‌న్ జ‌ట్టును ప్ర‌క‌టించాడు.

Yuvraj Singh : ఆల్‪టైమ్ ఎలెవ‌న్‌ను ప్ర‌క‌టించిన యువ‌రాజ్‌.. ధోనీకి నో ఛాన్స్..

Yuvraj Singh Snubs MS Dhoni As He Names His All Time XI

Yuvraj Singh – MS Dhoni : టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ సార‌థ్యంలో ఇండియా ఛాంపియ‌న్స్ జ‌ట్టు వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 విజేత‌గా నిలిచింది. శ‌నివారం పాకిస్తాన్ ఛాంపియ‌న్స్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంత‌రం యువీ త‌న ఆల్‌టైమ్ ఎలెవ‌న్ జ‌ట్టును ప్ర‌క‌టించాడు. ఈ జ‌ట్టులో త‌న స‌హ‌చ‌రుడు, టీమ్ఇండియాకు మూడు ప్ర‌పంచ‌క‌ప్‌లు అందించిన మ‌హేంద్ర సింగ్ ధోనికి చోటు ఇవ్వ‌లేదు. ముగ్గురు భార‌త ప్లేయ‌ర్ల‌కే ఛాన్స్ ఇచ్చాడు.

భార‌త్ నుంచి స‌చిన్ టెండూల్క‌ర్‌, రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌ను మాత్ర‌మే తీసుకున్నాడు. ఏ భార‌త బౌల‌ర్‌ను యువీ తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఓపెన‌ర్లుగా స‌చిన్ టెండూల్క‌ర్‌, రికీ పాంటింగ్‌ల‌ను ఎంచుకున్నాడు. రోహిత్ శ‌ర్మ, విరాట్ కోహ్లిల‌కు వ‌రుస‌గా మూడు, నాలుగు స్థానాల్లో తీసుకున్నాడు. ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు ఏబీ డివిలియ‌ర్స్‌ను ఐదో స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ గిల్‌క్రిస్ట్‌ను వికెట్ కీప‌ర్‌గా తీసుకున్నాడు.

BCCI : ఎట్ట‌కేల‌కు.. మాజీ ఆట‌గాడు గైక్వాడ్ చికిత్స‌కు బీసీసీఐ కోటి రూపాయ‌ల సాయం..

స్పిన్నర్లు షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ ఎంపిక చేశాడు. పేస‌ర్లుగా గ్లెన్ మెక్‌గ్రాత్‌, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్‌ లను ఎంచుకున్నాడు. ఇక 12వ ప్లేయ‌ర్‌గా త‌న పేరును చేర్చుకున్నాడు.

యువరాజ్ సింగ్ ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ 11ఇదే..
సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ (వికెట్ కీపర్), ఆండ్రూ ఫ్లింటాఫ్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్. (12 ప్లేయ‌ర్‌గా యువరాజ్ సింగ్).

యువీ టీమ్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా.. ధోనితో ఉన్న విభేదాల నేప‌థ్యంతోనే యువీ త‌న జ‌ట్టులో అత‌డికి చోటు ఇవ్వ‌లేద‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే.. గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో యువీ మాట్లాడుతూ.. ధోనితో త‌న‌కు స్నేహం లేద‌ని, స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌మేన‌ని స్ప‌ష్టం చేశాడు. సహచర ఆటగాడు బెస్ట్ ఫ్రెండ్ కావాల్సిన అవసరం లేదన్నాడు. అయితే మైదానంలో దిగినప్పుడు మాత్రం ఈగోలను పక్కనపెట్టి దేశం కోసం ఆడాల్సి ఉంటుందని చెప్పాడు.

మ‌రీ ఇంత స్వార్థ‌ప‌రుడివి ఏంట్రా బాబు.. నువ్వు ఇండియా బాబ‌ర్ ఆజాంవి.. గిల్‌పై నెట్టింట దారుణ ట్రోలింగ్‌..