కోహ్లీ.. పంత్‌కు సాయం చేయాలంటోన్న యువరాజ్

కోహ్లీ.. పంత్‌కు సాయం చేయాలంటోన్న యువరాజ్

Updated On : September 24, 2019 / 11:15 AM IST

యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ ఎదుర్కొంటున్న విమర్శల నుంచి కాపాడాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కోరాడు. పంత్ తనకున్న అనుభవానికి మించి విమర్శలు ఎదుర్కొంటున్నాడని వాటి నుంచి అతణ్ని బయటపడేయాలని కోహ్లీకి సూచించాడు. టీమ్ మేనేజ్మెంట్ అతనికి ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్న పంత్.. సెలక్షన్ కమిటీ నుంచి ప్రాధ్యానం కోల్పోతున్నాడు. 

‘అతని(పంత్)కి ఏం జరుగుతుందో తెలీదు. తట్టుకోలేనన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ ఆదుకోవాల్సి ఉంది. ఐపీఎల్ లాంటి మెగా టోర్నీల్లో హిట్టింగ్‌తో యువ క్రికెటర్లు డబ్బులు సంపాదించుకుంటారు. కానీ, వారు బిజినెస్ చేయడమెలాగో సీనియర్లను చూసి నేర్చుకోవాలి. ఫార్మాట్‌కు తగ్గట్లుగా ఆట కనబరచాలి. అతనిలో నమ్మకాన్ని పెంచాలనుకుంటే దేశీవాలీ క్రికెట్‌లో ఆడేందుకు అవకాశం ఇవ్వాలి. వికెట్ కీపింగ్‌లో టాలెంట్ ఉందని నమ్మితే దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయాలి’ అని యువరాజ్ సూచించాడు.

‘అతని వ్యక్తిత్వం తెలుసుకుని ప్రయత్నించాలి. మనస్తత్వం తెలిశాక దాని గురించి చెప్తే కచ్చితంగా సెట్ అవుతుంది. అంతేకానీ, ఘాటైన విమర్శలతో అతణ్నుంచి బెస్ట్ రాబట్టలేం. నాకు తెలుసు. భారత జట్టులో పరిస్థితులు బాగాలేనప్పుడు మానసికంగా ధైర్యం చెప్పిన వాళ్లు ఎవ్వరూ లేరు. గ్యారీ కిర్‌స్టన్, ప్యాడీ అప్‌టాన్ లాంటి వాళ్లు వచ్చే వరకూ పరిస్థితులు ఇలానే ఉన్నాయి’ అని యువరాజ్ వివరించాడు.