2025లో టాప్ 5 IP68 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. వానాకాలంలో ఇక భయం అవసరం లేదు..
ఇవి ఎందుకు ప్రత్యేకం.. ఏమేం ఉన్నాయి?

స్మార్ట్‌ఫోన్లను ఆయా కంపెనీలు వాటర్, డస్ట్, సన్‌లైట్‌ను కూడా తట్టుకునేలా తయారు చేస్తున్నాయి. మార్కెట్లో టాప్ 5 IP68 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు ఏవో చూద్దాం.
వానాకాలంలో మీ ఫోన్ పావడకుండా ఉండడానికి వీటిని కొంటే బెటర్. 1.5 మీటర్ల లోతులో 30 నిమిషాల పాటు నీటిలో మునిగిపోయినా ఈ ఫోన్లు సురక్షితంగా ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో ఉన్న అత్యుత్తమ IP68 వాటర్‌ప్రూఫ్ ఫోన్లను చూద్దాం..
Samsung Galaxy S24 Ultra
ఈ ఫోన్ అత్యుత్తమ కెమెరా, AI ఫీచర్లతో పాటు IP68 స్టాండర్డ్‌తో వచ్చింది. గోరిల్లా గ్లాస్ ఆర్మర్, టైటానియం ఫ్రేమ్ డిజైన్ వల్ల ఇది ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటుంది.
ఇది ఎందుకు ప్రత్యేకం.. ఏమేం ఉన్నాయి?
- IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్
- శక్తిమంతమైన బిల్డ్, ప్రీమియం ఫీచర్లు
- బలమైన AI ఫీచర్లు, క్వాడ్ కెమెరా సెటప్
iPhone 15 Pro Max
IP68 సర్టిఫైడ్ ఫోన్ ఇది. ఎయిరోస్పేస్ గ్రేడ్ టైటానియం, సిరామిక్ షీల్డ్ గ్లాస్ వాడటం వల్ల ఇది డ్యామేజ్‌కి తట్టుకుంటుంది. చినుకుల్లోనూ, నీటిలోనూ, వర్షంలోనూ ఇది పనిచేస్తుంది.
ఈ ప్రత్యేకత ఎందుకంటే?
- 6 మీటర్ల లోతులో 30 నిమిషాల వరకూ నీటిని తట్టుకోగలదు
- మన్నికైన మెటలిక్ డిజైన్
- iOS పర్ఫార్మెన్స్ స్మూత్‌గా ఉంటుంది
Sony Xperia 1 VI
క్రియేటర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కెమెరా ఫోన్. ఇది 4K OLED స్క్రీన్, మాన్యువల్ కెమెరా కంట్రోల్స్‌తో వస్తుంది. మారుతున్న వాతావరణాల్లో కంటెంట్ క్రియేట్ చేయడం కోసం ఇది సరైన ఆప్షన్.
ప్రత్యేకతలు
- 4K HDR OLED స్క్రీన్
- స్లిమ్, వాటర్, డస్ట్ రెసిస్టెంట్
- ప్రొఫెషనల్ కెమెరా ఫీచర్లు
Google Pixel 9 Pro
IP68 ప్రమాణాలతో Google Pixel 9 Pro లో Gemini Nano AI ఉంది. రేన్‌లో కాల్‌లు, బీచ్‌లో ఫొటోలు తీసేందుకు అనువైన ఫోన్. టెన్సర్ G4 చిప్, స్టాక్ Android ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
ఇది ఎందుకు ప్రత్యేకం?
- IP68 రేటింగ్
- AI ఫీచర్లతో స్టాక్ Android
- శక్తివంతమైన Tensor G4 చిప్
OnePlus 13
OnePlus 13 కూడా ఫుల్ IP68 వాటర్‌ప్రూఫ్ ప్రొటెక్షన్‌తో వచ్చింది. డిస్‌ప్లే, బ్యాటరీ లైఫ్, చిప్‌సెట్ శక్తి.. ఇలా అన్నింటిలోనూ ఇది ఫ్లాగ్‌షిప్ స్థాయిలో ఉంటుంది.
ప్రత్యేకతలు
- Snapdragon 8 Gen 4 ద్వారా స్టేబుల్ పర్ఫార్మెన్స్
- IP68 వాటర్‌ప్రూఫ్
- OxygenOSలో ఇంటెలిజెంట్