UPI Vs UPI Wallet : యూపీఐ యూజర్లకు అలర్ట్.. లో-వాల్యూ పేమెంట్లు చేస్తున్నారా? యూపీఐ వ్యాలెట్లకు ఎందుకు మారాలంటే?

UPI Vs UPI Wallet _ Why switching to UPI Wallets
UPI Vs UPI Wallet : యూపీఐ వాడుతున్నారా? అయితే, యూపీఐ లేదా యూపీఐ వ్యాలెట్ల మధ్య తేడా ఏంటి? భద్రతపరంగా ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు. చిన్న మొత్తంలో పేమెంట్ల కోసం యూపీఐ వ్యాలెట్లకు మారితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. యూపీఐ నుంచి యూపీఐ వ్యాలెట్లకు మారడం వల్ల భద్రత సౌలభ్యం పెరుగుతుంది. యూపీఐ మీ బ్యాంక్ అకౌంట్ నేరుగా కనెక్ట్ అయినప్పుడు, యూపీఐ వ్యాలెట్లు ముందుగా లోడ్ చేసిన బ్యాలెన్స్‌ని ఉపయోగించడం ద్వారా మీ ఫైనాన్షియల్ ఎక్స్‌పోజర్ పరిమితం చేస్తాయి.
తద్వారా లో-వాల్యూ లావాదేవీలను సురక్షితంగా చేస్తుంది. భారత్‌లో డిజిటల్ పేమెంట్లు పెరిగిపోతున్న తరుణంలో చిన్న లావాదేవీల కోసో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్), యూపీఐ వ్యాలెట్ల మధ్య ఎంచుకోవడం చాలా కీలకంగా మారింది. యూపీఐ నేరుగా బ్యాంక్-టు-బ్యాంక్ లావాదేవీలను అనుమతిస్తుంది. యూపీఐ వ్యాలెట్లు అనేవి చిన్న, రోజువారీ పేమెంట్ల చెల్లింపులకు సురక్షితమైనదిగా చెప్పవచ్చు.
1. యూపీఐ, యూపీఐ వ్యాలెట్ల మధ్య తేడా ఏంటి? :
యూపీఐ అనేది గూగుల్ పే, ఫోన్‌పే లేదా పేటీఎం వంటి యాప్‌లతో మొబైల్ డివైజ్ ద్వారా రెండు బ్యాంక్ అకౌంట్ల మధ్య ఇన్‌స్టంట్ క్యాష్ పొందవచ్చు. మరోవైపు, యూపీఐ వ్యాలెట్లు మీ యూపీఐ యాప్‌లకు లింక్ చేసిన ప్రీపెయిడ్ వ్యాలెట్లు, బ్యాలెన్స్‌ను స్టోర్ చేస్తాయి. మీ బ్యాంక్ అకౌంట్ నేరుగా యాక్సెస్ చేయకుండా చిన్న లావాదేవీల కోసం ఆ మొత్తాన్ని ఉపయోగించవచ్చు.
2. పేమెంట్లపై యూపీఐ వ్యాలెట్ల సెక్యూరిటీ బెనిఫిట్స్ :
యూపీఐ వ్యాలెట్లు సాధారణంగా లో-వాల్యూ పేమెంట్లకు సురక్షితమైనవి. ఎందుకంటే.. చిన్నమొత్తంలో చెల్లింపులకు మీ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ సురక్షితంగా ఉంటుంది. యూపీఐ వ్యాలెట్ ద్వారా మీ ఫైనాన్షియల్ ఎక్స్‌పోజర్‌ను పరిమితం చేస్తుంది. ప్రత్యేకించి చిరువ్యాపారుల వద్ద లేదా తెలియని ప్రదేశాలలో చెల్లింపులు సమయంలో మరింత భద్రతను అందిస్తుంది.
3. ఓవర్‌డ్రాఫ్ట్‌లు, పేమెంట్ ఫెయిల్ సమస్య ఉండదు :
యూపీఐకి సంబంధించిన సమస్య ఏమిటంటే.. మీ బ్యాంక్ అకౌంట్లలో తగినంత ఫండ్స్ లేకున్నా లేదా లావాదేవీ విఫలమైతే.. ఓవర్‌డ్రాఫ్ట్‌లకు కారణం కావచ్చు. యూపీఐ వ్యాలెట్లు ముందుగా లోడ్ చేసిన బ్యాలెన్స్‌ని వాడేందుకు మాత్రమే అనుమతిస్తుంది. తద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. పేమెంట్ ఫెయిల్ కాకుండా వేగంగా లావాదేవీలను పూర్తి చేయొచ్చు.
4. యూపీఐ లావాదేవీలపై పరిమితులు :
యూపీఐ లావాదేవీలకు బ్యాంకులు రోజువారీ పరిమితులు విధిస్తాయి. యూపీఐ వ్యాలెట్లతో ఉపయోగించడం వల్ల వ్యాలెట్లపై ప్రత్యేక పరిమితులు ఉంటాయి. అందులో కిరాణా, యూటిలిటీ బిల్లులు లేదా ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్‌లకు చిన్నమొత్తంలో చెల్లింపులకు యూపీఐ వ్యాలెట్లు ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు.
5. క్యాష్‌బ్యాక్, రివార్డ్‌లు :
సాధారణ యూపీఐ లావాదేవీలతో పోలిస్తే.. యూపీఐ వ్యాలెట్లతో ఎక్కువ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు, రివార్డ్‌లను పొందవచ్చు. చాలా మంది వ్యాలెట్ ప్రొవైడర్‌లు, మర్చంట్లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో పార్టనర్‌గా ఉన్నారు. రోజువారీ కొనుగోళ్లు చేసే కస్టమర్‌లకు వ్యాలెట్ వినియోగం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
6. యూపీఐ వాడకం చాలా ఈజీ :
యూపీఐలో అమౌండ్ లోడ్ చేశాక యూపీఐ వ్యాలెట్లు చిన్న మొత్తం, రీపేమెంట్లకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రతి లావాదేవీకి యూపీఐ పిన్‌లను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.దాంతో పేమెంట్లను వేగంగా ఈజీగా పూర్తి చేయొచ్చు. ముఖ్యంగా రోజువారీ చిన్నపాటి లావాదేవీలను నిర్వహించే వ్యాపారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
చిన్న మొత్తంలో పేమెంట్ల కోసం యూపీఐ నుంచి యూపీఐ వ్యాలెట్లకు మారడం ద్వారా మరింత భద్రతను అందిస్తుంది. పేమెంట్ ఫెయిల్ కాకుండా నివారించడమే కాదు.. క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. యూపీఐ బిగ్ పేమెంట్లకు అద్భుతమైనది. అయితే, రోజువారీ కొనుగోళ్లకు యూపీఐ వ్యాలెట్లను వాడటం ద్వారా మీ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ సేఫ్‌గా ఉంటుంది.