MLA Rekhanaik Corona : ఎమ్మెల్యే రేఖానాయక్ కు కరోనా పాజిటివ్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Mla Rekhanaik Corona
Corona positive for MLA Rekhanaik : కరోనా దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గిరిజన ప్రాంతాలకు మాత్రం ఆ వైరస్ పాకడం లేదు. వారు తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు వారికి శ్రీరామరక్షగా నిలుస్తోంది. అయితే తొలిసారిగా గిరిజన ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రేఖానాయక్ కు ఆదివారమే కొవిడ్-19 పాజిటివ్‌గా తేలగా విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆమె పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.