Telangana Assembly : అసెంబ్లీకి హాజరుపై బీజేపీ ఎమ్మెల్యేల మధ్య భిన్నాభిప్రాయాలు.. రాజాసింగ్ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తున్న నేతలు

ప్రొటెం స్పీకర్ అక్బరుద్ధీన్ ముందు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసేందుకు టీ.బీజేపీ నేతలు ఇష్టపడలేదు.దీంతో ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అదే విషయాన్ని చెప్పారు. దీంతో శాసనసభకు హాజరుకావటంతో బీజేపీ ఎమ్మెల్యేల్లో బేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి.

Telangana Assembly : అసెంబ్లీకి హాజరుపై బీజేపీ ఎమ్మెల్యేల మధ్య భిన్నాభిప్రాయాలు.. రాజాసింగ్ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తున్న నేతలు

BJLP meeting

Updated On : December 15, 2023 / 2:54 PM IST

Telangana Assembly..BJLP meeting : తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు రోజులకే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం చేయించారు. కాగా..ప్రొటెం స్పీకర్ అక్బరుద్ధీన్ ముందు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసేందుకు టీ.బీజేపీలో కొంతమంది నేతలు అంగీకరించలేదు. దీంతో అసెంబ్లీలో ప్రమాణ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అదే విషయాన్ని చెప్పారు. దీంతో బీజేపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు శాసనసభకు రావటంలేదని తేల్చి చెప్పారు.

ఈ క్రమంలో బీజేపీ శాసన సభా పక్ష నేతను ఎన్నుకునేందుకు సమావేశమైన బీజేపీ నేతలల్లో అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో బిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఎమ్మెల్యేలతో ఓటింగ్ నిర్వహించి వారి అభిప్రాయాలను కిషన్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. హై కమాండ్ నుంచి ప్రకటన వచ్చాకే కార్యాచరణ ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పారు.

గాంధీ భవన్‌లో సోనియా గాంధీ బర్త్ డే వేడుకల్లో ఆసక్తికర దృశ్యాలు

అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని రాజాసింగ్ చేసిన ప్రటనపై ఎమ్మెల్యేలు విభేధించారు. అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసేందుకే ఆసక్తి చూపారు. దీంతో ఎమ్మెల్యేలు అందరి వద్ద ఓటింగ్ తీసుకునేందుకు కిషన్ రెడ్డి సిద్దపడ్డారు. దాన్ని అధిష్టానానికి పంపి అక్కడి నిర్ణయం వచ్చాక కార్యాచరణ ఉంటుందని చెప్పారు.

కాగా..ఫ్లోర్ లీడర్ రేసులో రాజాసింగ్, ఏలేటీ మహేశ్వర రెడ్డి ఉన్నారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై గెలుపు సాధించిన కామారెడ్డి డీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కూడా ఉన్నారు. కాగా..వెంకట రమణారెడ్డికే ఎక్కువ అవకాశం ఉందని బీజేపీలో చర్చ నడుస్తోంది.