Maharashtra encounter : మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ పోలీసుల హైఅలర్ట్

మహారాష్ట్రలో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Maharashtra encounter : మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ పోలీసుల హైఅలర్ట్

Maharashtra Encounter

Updated On : March 30, 2021 / 1:56 PM IST

High alert of Telangana police : మహారాష్ట్రలో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. గడ్చిరోలిలో నిన్ని జరిగిన ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్న మావోయిస్టులు తెలంగాణ వైపు వస్తారన్న సమాచారం అందడంతో అంతర్‌రాష్ట్ర బ్రిడ్జి దగ్గర తనిఖీలు జరుపుతున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

గడ్చిరోలిలో నిన్న భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా ఐదుగురు చనిపోయారు.

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీగా పేలుడు పదార్ధాలు, నిత్యావసర వస్తువులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.