Husband Suicide : అయ్యో.. భార్య డెలివరీకి డబ్బులు లేక భర్త ఆత్మహత్య

సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ కారణంగా ఉపాధి కరువై భార్య డెలివరీకి కూడా డబ్బులు లేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. చందాపూర్​ గ్రామానికి చెందిన పడాడ ప్రశాంత్(25), నాగమణి భార్యాభర్తలు. ప్రశాంత్ కొన్నాళ్లుగా సిద్దిపేటలో ఉంటూ ఆటో నడుపుకుంటున్నాడు. కరోనా, లాక్​డౌన్ ​ఎఫెక్ట్​తో ఆటో నడవడం లేదు. దాని ఈఎంఐలు కట్టడానికి, కుటుంబ పోషణకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు.

Husband Suicide : అయ్యో.. భార్య డెలివరీకి డబ్బులు లేక భర్త ఆత్మహత్య

Husband Suicide

Updated On : May 17, 2021 / 10:07 PM IST

Husband Suicide : సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ కారణంగా ఉపాధి కరువై భార్య డెలివరీకి కూడా డబ్బులు లేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. చందాపూర్​ గ్రామానికి చెందిన పడాడ ప్రశాంత్(25), నాగమణి భార్యాభర్తలు. ప్రశాంత్ కొన్నాళ్లుగా సిద్దిపేటలో ఉంటూ ఆటో నడుపుకుంటున్నాడు. కరోనా, లాక్​డౌన్ ​ఎఫెక్ట్​తో ఆటో నడవడం లేదు. దాని ఈఎంఐలు కట్టడానికి, కుటుంబ పోషణకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు.

ఇటీవల తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు బైక్​ను అమ్మేశాడు. దీనికి తోడు భార్య డెలివరీ టైం దగ్గర పడింది. వారం క్రితం ఆమెను టౌన్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించాడు. ఆదివారం ఆమెను డిశ్చార్జి చేయాల్సి ఉంది. అయితే చేతిలో డబ్బులు లేవు. ఆ డబ్బు కట్టే మార్గం కనిపించక కుంగిపోయిన ప్రశాంత్ పత్తి మార్కెట్ దగ్గర లోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశాంత్​ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను చిద్రం చేసింది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఉపాధి కరువై చాలామందికి తినడానికి తిండి కూడా దొరకడం లేదు. పనులు లేకపోవడంతో అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బతికే దారి కనిపించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.