IndiGo Flights: శంషాబాద్ నుండి మాల్దీవులకు ఫ్లైట్ సర్వీస్ ప్రారంభం!
శంషాబాద్ విమానాశ్రయం నుండి మాల్దీవులకు మళ్ళీ విమానసర్వీసులను ప్రారంభించారు. మాల్దీవులలోని మాలేకు ఈ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి.

Indigo Flights
IndiGo Flights: శంషాబాద్ విమానాశ్రయం నుండి మాల్దీవులకు మళ్ళీ విమానసర్వీసులను ప్రారంభించారు. మాల్దీవులలోని మాలేకు ఈ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఆదివారం నుండి ఇండిగో విమాన సంస్థ ఈ సర్వీసును ప్రారంభించింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కు ముందు ఈ విమాన సర్వీసులు నడుస్తుండగా లాక్ డౌన్ తో నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సర్వీసులను పునఃప్రారంభించారు.
ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు ఇండిగో విమానం 6E 8108 శంషాబాద్ విమానాశ్రయంలో బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు మాల్దీవులలోని వెలానా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఆదివారంతో మొదలైన ఈ సర్వీసులు ఇకపై వారానికి మూడు రోజులు అందుబాటులో ఉండనున్నాయి.
నేడు నుండి శంషాబాద్ నుంచి మాలేకు వారానికి మూడుసార్లు విమానాలను నడపనున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి వారం మంగళవారం, గురువారం, ఆదివారం మూడు రోజులు ఈ విమానాలు నడుస్తాయని.. అక్టోబర్ 15 తర్వాత సోమ, బుధ, శుక్ర ఆదివారాలు ఈ విమానాలు నడుస్తాయని తెలిపింది.