Harish Rao: టీఆర్‌ఎస్ పనిచేసే పార్టీ కానీ, పంచే పార్టీ కాదు -హరీష్ రావు
హుజూరాబాద్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే విస్తృతంగా జరుగుతున్న ప్రచారంతో రోజురోజుకీ రాజకీయ వేడి రాజుకుంటోంది.

Eetala
Harish Rao: హుజూరాబాద్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే విస్తృతంగా జరుగుతున్న ప్రచారంతో రోజురోజుకీ రాజకీయ వేడి రాజుకుంటోంది. తనను ఓడించేందుకు ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు.
అయితే తాను దిక్కులేనివాడిని కాదని, తన గెలుపును ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. మరోవైపు దళిత బంధుపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత కుటుంబానికి ఇచ్చే 10 లక్షలకు తోడు కేంద్రం నుంచి 40 లక్షలు తేవాలని బండి సంజయ్, ఈటల రాజేందర్‌ను డిమాండ్ చేశారు హరీష్‌రావు.
టీఆర్‌ఎస్ ప్రలోభాలకు గురిచేస్తోందంటూ ఈటల చేసిన విమర్శలను తిప్పొకొట్టారు. టీఆర్‌ఎస్ పనిచేసే పార్టీ కానీ, పంచే పార్టీ కాదని పంచ్ వేశారు. ఓట్ల కోసం గిఫ్ట్‌లు, డబ్బులు పంచేవాళ్లెవరో అందరికీ తెలుసంటూ మండిపడ్డారు. బీజేపీ సెంటిమెంట్‌తో గెలవాలని అనుకుంటోందని.. కానీ అభివృద్ధి చేసి మరీ టీఆర్‌ఎస్ ఓట్లు అడుగుతోందని అన్నారు.