KA Paul: మా మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టింది: కేఏ పాల్

తెలంగాణను రక్షించుకోవడానికి ఇది చివరి అవకాశమని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.

KA Paul: మా మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టింది: కేఏ పాల్

KA paul

Updated On : October 15, 2023 / 7:13 PM IST

Assembly Elections 2023: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని చెప్పారు.

సీఎం కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని కేఏ పాల్ అన్నారు. బీఆర్ఎస్ కి సీట్లు తక్కువగా వస్తే కాంగ్రెస్ ను కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. ప్రజలు ఆలోచించాలని, తన ప్రజాశాంతి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తానని కేఏ పాల్ తెలిపారు. జనాల దగ్గరి నుంచి దోచుకున్న సొమ్మును తీసుకుని మళ్లీ ఎన్నికల వేళ నేతలు జనాలకు పంచుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తుందా అని ప్రశ్నించారు. తెలంగాణను రక్షించుకోవడానికి ఇది చివరి అవకాశమని చెప్పుకొచ్చారు.

Revanth Reddy : మా మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారు- రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు