Pocharam Srinivas Reddy : ఎన్టీఆర్ కు నిజమైన రాజకీయ వారసుడు కేసీఆర్ : స్పీకర్ పోచారం

సంక్షేమ రంగానికి నాంది పలికింది ఎన్టీఆర్ అని కొనియాడారు. ఉచిత కరెంట్ ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్ దేనని స్పష్టం చేశారు.

Pocharam Srinivas Reddy : ఎన్టీఆర్ కు నిజమైన రాజకీయ వారసుడు కేసీఆర్ : స్పీకర్ పోచారం

Pocharam Srinivas Reddy

Updated On : May 28, 2023 / 6:59 AM IST

NTR Bronze Statue : ఎన్టీఆర్ కు నిజమైన రాజకీయ వారసుడు కేసీఆర్ అని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సుస్థిర పాలనతో అభివృద్ధి సాధ్యమని తెలిపారు. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో తాను ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యేవాడినని చెప్పారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని వర్నిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1949లో మనదేశంలో ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేశారని తెలిపారు. 1982లో రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నవారిలో సగం మంది ఎన్టీఆర్ వారసులేనని చెప్పారు.

Chandrababu : రూ. 500 నోట్లను కూడా రద్దు చేయాలి : చంద్రబాబు

సంక్షేమ రంగానికి నాంది పలికింది ఎన్టీఆర్ అని కొనియాడారు. ఉచిత కరెంట్ ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్ దేనని స్పష్టం చేశారు. పార్టీలు వేరైనా ఎన్టీఆర్ వారసులమేనని తేల్చి చెప్పారు. ఆయన స్పూర్తే తమకు ఆదర్శం అన్నారు. తమకు ఏ పదవి వచ్చినా.. అది ఎన్టీఆర్ పెట్టిన భిక్షనే అని తెలిపారు.