Hyderabad: రేపే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కొత్తగూడ ఫ్లై ఓవర్ ప్రారంభం.. గచ్చిబౌలి ట్రాఫిక్ సమస్యకు చెక్

హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రవాణా వ్యవస్థను అందించే లక్ష్యంతో ఎస్ఆర్‌డీపీ కింద జీహెచ్ఎంసీ ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది. రూ.263 కోట్లతో నిర్మితమైన ఈ ఫ్లై ఓవర్, 2,216 మీటర్ల పొడవుంది. ఇది కొత్తగూడ నుంచి గచ్చిబౌలి వరకు ఉంటుంది.

Hyderabad: రేపే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కొత్తగూడ ఫ్లై ఓవర్ ప్రారంభం.. గచ్చిబౌలి ట్రాఫిక్ సమస్యకు చెక్

Updated On : December 31, 2022 / 8:40 PM IST

Hyderabad: హైదరాబాద్ వాసులకు నూతన సంవత్సరం నుంచి మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలి ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా నిర్మించిన కొత్తగూడ్ ఫ్లైఓవర్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఫ్లైఓవర్‌ను జనవరి 1న ప్రారంభించనున్నారు.

Twitter: ఇంటి నుంచే టాయిలెట్ పేపర్స్ తెచ్చుకుంటున్న ట్విట్టర్ స్టాఫ్.. మస్క్ చర్యలతో ఉద్యోగుల తిప్పలు

హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రవాణా వ్యవస్థను అందించే లక్ష్యంతో ఎస్ఆర్‌డీపీ కింద జీహెచ్ఎంసీ ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది. రూ.263 కోట్లతో నిర్మితమైన ఈ ఫ్లై ఓవర్, 2,216 మీటర్ల పొడవుంది. ఇది కొత్తగూడ నుంచి గచ్చిబౌలి వరకు ఉంటుంది. రెండు కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణికులు ట్రాఫిక్ లేకుండా సులభంగా వెళ్లొచ్చు. ఈ ఫ్లై ఓవర్ ద్వారా బొటానికల్‌ గార్డెన్‌, కొత్తగూడ, కొండాపూర్‌ జంక్షన్‌ల మధ్య సులభంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. ఈ ఫ్లై ఓవర్ ఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినల్ నుంచి బొటానికల్‌ జంక్షన్‌ వరకు ఐదు లేన్లతో, బొటానికల్‌ జంక్షన్‌ నుంచి కొత్తగూడ జంక్షన్‌ వరకు ఆరు లేన్లతో, కొత్తగూడ జంక్షన్‌ నుంచి కొండాపూర్‌ ఆర్టీఏ ఆఫీస్‌ వరకు మూడు లేన్లతో నిర్మించారు.

GST Return: ఐటీఆర్, జీఎస్‌టీ రిటర్న్‌కు నేడే ఆఖరి రోజు… కీలకాంశాలివే

అలాగే కొత్తగూడ నుంచి హైటెక్ సిటీ వెళ్లేందుకు 338 మీటర్ల పొడవుతో హైటెక్ సిటీ వైపు మూడు లేన్ల డౌన్ ర్యాంప్, మసీదు బండ నుంచి బొటానికల్ జంక్షన్ వైపు వెళ్లేందుకు రెండు లేన్లతో బొటానికల్ అప్ ర్యాంప్, అటునుంచి హఫీజ్‌పేట వెళ్లేందుకు 470 మీటర్ల పొడవు కలిగిన అండర్ పాస్‌ను కూడా నిర్మించారు. ఇవన్నీ అందుబాటులోకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ఇక్కడున్న ఐటీ కంపెనీల ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ఇటీవలే మంత్రి కేటీఆర్ సైబరాబాద్ ఏరియాలో శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.