Teenmar Mallanna: ఆ మూడు పార్టీలు మోసం చేశాయి, సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి, వచ్చేది బీసీ ప్రభుత్వమే- తీన్మార్ మల్లన్న

రాబోయే ఎన్నికల్లో బీసీ పొలిటికల్ జేఏసీ పోటీ చేస్తోంది. బీసీ వాటా కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఐక్యత చాటుతాం.

Teenmar Mallanna: ఆ మూడు పార్టీలు మోసం చేశాయి, సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి, వచ్చేది బీసీ ప్రభుత్వమే- తీన్మార్ మల్లన్న

Updated On : August 8, 2025 / 6:27 PM IST

Teenmar Mallanna: బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీలని మల్లన్న ఆరోపించారు. రాష్ట్రపతిని కలవకుండా అమిత్ షా, మోదీ అడ్డుకున్నారని.. తెలంగాణ ప్రజలను ముఖ్యంగా బీసీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేయబోతోందన్నారు. 42శాతం రిజర్వేషన్ ఇవ్వలేము అని కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పిందన్నారు.

”బీసీ బిల్లును ఢిల్లీలో అడ్డుకుంటారని అన్ని పార్టీలకు తెలుసు. పార్టీ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తా అనడం ఇందుకు నిదర్శనం. 15 శాతం అగ్ర వర్ణాలకు ఇచ్చి మిగిలినవి బీసీ ఎ‌స్సీ ఎస్టీలకు ఇస్తుందా? బీసీలకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. 70 సంవత్సరాలుగా మూడు పార్టీలు బీసీలను మోసం చేశాయి. బీసీలను మోసం చేసిన పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. బీసీలు విద్య ఉద్యోగాలలో తీవ్రంగా మోసపోతున్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి.

బీసీ రిజర్వేషన్ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో కాదు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు క్షమాపణ చెప్పాలి. అగ్రవర్ణాలు ఎన్నికల బరిలో ఉంటే బీసీలు ఓటు వేయొద్దు. రాబోయే ఎన్నికల్లో బీసీ పొలిటికల్ జేఏసీ పోటీ చేస్తోంది. బీసీ వాటా కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఐక్యత చాటుతాం. రాబోయేది బీసీ ప్రభుత్వమే. ఈబీసీపై విచారణ చేస్తాం. లాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి బీసీలకు 2 ఎకరాలు ఇస్తాం” అని తీన్మార్ మల్లన్న అన్నారు.

Also Read: భార్యాభర్తల మాటలూ విన్నారు.. వేల కోట్లు దోచుకున్నారు.. సీబీఐకి అప్పగించాలి- ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంచలన వ్యాఖ్యలు