Munugode BY Poll : గుజరాత్ కు రూ. 80 వేల కోట్లు ఇచ్చారు..తెలంగాణకు రూ. 18 వేల కోట్లు ఇవ్వలేరా? : కేటీఆర్

గుజరాత్ కు రూ. 80 వేల కోట్లు ఇచ్చారు..తెలంగాణకు రూ. 18 వేల కోట్లు ఇవ్వలేరా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీని ప్రశ్నించారు.

Munugode BY Poll : గుజరాత్ కు రూ. 80 వేల కోట్లు ఇచ్చారు..తెలంగాణకు రూ. 18 వేల కోట్లు ఇవ్వలేరా? : కేటీఆర్

Minister KTR questions to PM Modi

Updated On : October 12, 2022 / 12:31 PM IST

Munugode BY Poll :  ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు సంధించారు. సొంతరాష్ట్రానికి గత ఐదు నెలల్లో రూ.80వేట కోట్లు ఇచ్చారు తెలంగాణకు కనసీం రూ.18వేల కోట్లు ఇవ్వలేరా? అంటూ ప్రశ్నించారు. ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయినంత మాత్రాన దేశ సంపద పెరగదు..అలాగే మరొక వ్యక్తికి కాంట్రాక్టు ఇచ్చినంత మాత్రాన జిల్లా బాగుపడదని అన్నారు మంత్రి కేటీఆర్.

Munugode By Poll : కోమటిరెడ్డి టార్గెట్‌గా.. మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారాస్త్రంగా మారిన రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీపై ప్రశ్నలు సంధించారు. తమకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు… నల్గొండ ప్రయోజనాలే ముఖ్యం మోడీ గారూ అంటూ ట్వీట్ చేశారు. గుజరాత్ కు గత ఐదు నెలల్లో రూ. 80 వేల కోట్ల ప్యాకేజీలు ఇచ్చారని… మా తెలంగాణకు కనీసం రూ. 18 వేల కోట్లు ఇవ్వలేరా? అంటూ ప్రశ్నించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి

ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం మిషన్ భగీరథకి రూ. 19 వేల కోట్లను కేటాయించమని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే పెడచెవిన పెట్టారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టును ఇచ్చారంటూ విమర్శించారు. ఇప్పటికైనా మోడీ గారు నల్గొండ జిల్లాకు రూ. 18 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటిస్తే మునుగోడు పోటీ నుంచి తప్పుకుంటామని… దీనికి బీజేపీ సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.