Harish Rao : అక్కడ 2గంటల కరెంట్‌కే దిక్కులేదు, కాంగ్రెస్ మనకు అవసరమా? హరీశ్ రావు
Harish Rao Slams Congress : 11 సార్లు అవకాశం ఇచ్చినా కనీసం బిందె నీళ్ళు ఇవ్వలేదు. 100 అబద్ధాలు ఆడి సీఎం కుర్చీ దక్కించుకోవాలని చూస్తోంది.

Harish Rao Slams Congress (Photo : Twitter)
కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి హరీశ్ రావు. 5 గంటల కరెంట్ ప్రచారంతో కాంగ్రెస్ అభాసుపాలైందన్నారు. ఉచిత కరెంట్ ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు హరీశ్ రావు. వ్యవసాయానికి ఎంత hp మోటార్ వాడతారో కూడా తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కర్ణాటకలో 2 గంటల కరెంట్ కూడా రావటం లేదని అక్కడి మాజీ సీఎం కుమార స్వామి చెబుతున్నారన్న మంత్రి హరీశ్ రావు.. ఇలాంటి కాంగ్రెస్ మనకు అవసరమా? అని ప్రశ్నించారు.

Harish Rao (Photo : Facebook)
తెలంగాణ వచ్చాక ములుగు జిల్లా అభివృద్ధి..
ములుగు జిల్లా బీజేపీ నేత రాములు యాదవ్, ఓదెల జెడ్పీటీసీ తాటికృష్ణ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. తెలంగాణ వచ్చాక ములుగు జిల్లా బాగా అభివృద్ధి జరిగిందన్నారు. ములుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా ములుగును జిల్లా చేశారని చెప్పారు. సమ్మక్క, సారక్క జాతరను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు కేసీఆర్, ఐటీసీ ఫ్యాక్టరీ ప్రారంభానికి రెడీగా ఉంది, ములుగు అభ్యర్థిగా నాగజ్యోతిని గెలిపించండి అని హరీశ్ రావు కోరారు.
Also Read : నన్ను చంపేందుకు కుట్ర, నాపై దాడి చేసింది వారే- గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు
పని తక్కువ ప్రచారం ఎక్కువ సీతక్కకు..
”ఎవరెన్ని చెప్పినా నమ్మకండి, రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం కొట్టడం ఖాయం. ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో మాత్రమే ఉంటారు. పని తక్కువ ప్రచారం ఎక్కువ సీతక్కకు. నిరుపేద అమ్మాయి నాగజ్యోతిని గెలిపించాలి. ఓడిపోతున్నానని తెలిసి కోపంతో ఇష్టం వచ్చినట్లు సీతక నోరు జారుతున్నారు. ఆమె ఓటమి ఖాయం.

Harish Rao (Photo : Twitter)
11సార్లు అవకాశం ఇచ్చినా కనీసం బిందె నీళ్ళు ఇవ్వలేదు..
కేసీఆర్ హయాంలో పల్లెల్లో కరవు లేదు. హైదరాబాద్ లో కర్ఫ్యూ లేదు. కర్ణాటకలో రైతుబందు ఇవ్వని కాంగ్రెస్ ఇక్కడ 15వేలు ఎలా ఇస్తుంది? కేసీఆర్ గెలిస్తే 16వేలు రైతు బంధు ఇవ్వటం ఖాయం. ధాన్యం కొనమంటే కేవలం 13 క్వింటాళ్ల కొంటామని చెబుతున్నారు. మరి మిగిలిన ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలి. 100 అబద్ధాలు ఆడి సీఎం కుర్చీ దక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. 11 సార్లు అవకాశం ఇచ్చినా కనీసం బిందె నీళ్ళు ఇవ్వలేదు కాంగ్రెస్. కేసీఆర్ ను భూతులు తిడుతున్నారు. మాకు తిట్టడం చేతకాక కాదు. తిడితే రేపటి వరకు తిడతాం. మాకు సంస్కారం ఉంది” అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Also Read : వచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే.. ఇంతకు ఇంత అనుభవిస్తారు.. వాళ్లకు కేటీఆర్ సీరియస్ వార్నింగ్