Rahul Gandhi: పదేళ్లుగా ఇక్కడ యుద్ధం జరుగుతోంది: రాహుల్ గాంధీ
రాష్ట్రంలో ఒకే కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని..

Rahul gandhi
Assembly Election 2023: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేళ్లుగా దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో నిర్వహించిన విజయభేరి యాత్రలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ముఖ్యమంత్రి ఒక రాజులాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఒకే కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, ఇచ్చి చూపించిందని చెప్పారు. సోనియా గాంధీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని అన్నారు. తెలంగాణలో రైతులకి లాభం చెకూరలేదని తెలిపారు. కొట్లాది రూపాయల దోపిడీ జరిగిందని ఆరోపించారు.
కాంట్రాక్టర్లకి దోచిపెడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒకటేనని అన్నారు. బీజేపీతో తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఇంత దోపిడి జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఒక్క కేసు కూడా నమోదు చేయడం లేదని తెలిపారు. పార్లమెంటులో బీజేపీ, బీఆర్ఎస్ సహకరించుకుంటున్నాయని అన్నారు.
ఎంఐఎం పార్టీ అభ్యర్థులు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. తమ కుటుంబంపై ప్రజలు ప్రేమానురాగాలు చూపుతున్నారని అన్నారు. తాను ఇక్కడికి అబద్ధాలు చెప్పడానికి రాలేదని చెప్పారు. తెలంగాణలో రైతులు తీసుకున్న లోన్లు మాఫీ కాలేదని అన్నారు.
Governor Indrasena Reddy : నాకు గవర్నర్ పదవి రావటం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు : ఇంద్రసేనారెడ్డి