Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు దుర్మరణం
Road Accident : రంగారెడ్డి జిల్లా మోకిల పరిధిలోని మీర్జాగూడా వద్ద గురువారం తెల్లవారుజామున ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది.
Road Accident
Road Accident : రంగారెడ్డి జిల్లా మోకిల పరిధిలోని మీర్జాగూడా వద్ద గురువారం తెల్లవారుజామున ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. గాయపడిన నక్షత్ర అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. కోకాపేటలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న తరువాత.. ఓ స్నేహితుడిని డ్రాప్ చేసి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : Rain Alert : రెయిన్ అలర్ట్.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వానలు..
హైదరాబాద్లోని ప్రముఖ కాలేజీకి చెందిన శ్రీనిఖిల్, సూర్యతేజ, సుమిత్, రోహిత్, నక్షత్ర, మరో వ్యక్తి కోకాపేటలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అందులో ఓ వ్యక్తిని డ్రాప్ చేసేందుకు నలుగురు వెళ్లారు. తిరిగి వస్తున్నక్రమంలో మీర్జాగూడా వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనిఖిల్, సూర్యతేజ, సుమిత్, రోహిత్ లు అక్కడికక్కడే మరణించారు. నక్షత్ర అనే విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాద సమయంలో కారు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తుందని గుర్తించారు. అతివేగం కారణంగానే కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
