సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్స్

Special trains to Tirupati : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఈ రైలు సర్వీసులు వచ్చే బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ (02770) సికింద్రాబాద్ నుంచి ఈ నెల 26న మొదలవుతుంది. మంగళ, శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు ఇది ప్రారంభమవుతుంది.
సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక (02732) రైలు ఈ నెల 27న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి బుధ, శనివారం సాయంత్రం 4.15 గంటలకు ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది.
తిరుపతి-సికింద్రాబాద్ స్పెషల్ (02731) తిరుపతి నుంచి ఈ నెల 28న ప్రారంభమవుతుంది. ఈ రైలు గురు, ఆదివారం సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి-సికింద్రాబాద్ స్పెషల్ (02769) తిరుపతి నుంచి ఈ నెల 29న ప్రారంభమవుతుంది. ప్రతి సోమ, శుక్రవారం సాయంత్రం 3.45గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది.
తిరుపతి-కరీంనగర్ స్పెషల్ (02761) తిరుపతి నుంచి ఈ నెల 27న ప్రారంభమవుతుంది. బుధ, శనివారం రాత్రి 8.15 గంటలకు ఇది బయలుదేరుతుంది. కరీంనగర్-తిరుపతి స్పెషల్ (02762) కరీంనగర్ నుంచి ఈ నెల 28న మొదలవుతుంది. గురు, ఆదివారాల్లో రాత్రి 7.15 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది.