కిరోసిన్ పోసుకుని టీచర్ ఆత్మహత్యాయత్నం: అధికారుల వేధింపులే కారణమా

  • Published By: veegamteam ,Published On : December 16, 2019 / 10:06 AM IST
కిరోసిన్ పోసుకుని టీచర్ ఆత్మహత్యాయత్నం: అధికారుల వేధింపులే కారణమా

Updated On : December 16, 2019 / 10:06 AM IST

అధికారులు వేధిస్తున్నారంటూ ఓ టీచర్ ఒంటిపై కిరోసిన పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని ప్రభుత్వ స్కూల్ లో పనిచేస్తున్న రాంబాయి ఆత్మహత్యకు యత్నించిది.

ఆత్మహత్యకు యత్నించిన టీచర్ ను గమనించిన స్థానికులు అడ్డుకుని ఆమెను హాస్పిటల్ కు తరలించారు.కాగా ఉన్నతాధికారులు రాంబాయిని వేధిస్తుండటంతో ఆత్మహత్యకు యత్నించిందని స్థానికులు అంటున్నారు. తనను మానసింగా అధికారులు వేధిస్తున్నారంటూ రాంబాయి ఏడుస్తూ వాపోయింది. తన ఈ పరిస్థితికి వారే కారణమని ఆరోపిస్తూ..ఆత్మహత్యకు యత్నించింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు హాస్పిటల్ కు తరలించారు.