Tandur CI Issue : నోరు జారాను… మాట మార్చేసిన పట్నం మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వ్యవహారం పొలిటకల్ హాట్ టాపిక్ అయ్యింది. బూతుపురాణం కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. పొరపాటున నోరు జారానంటూ...

Tandur CI Issue : నోరు జారాను… మాట మార్చేసిన పట్నం మహేందర్ రెడ్డి

Tandur Ci

Updated On : April 28, 2022 / 6:01 PM IST

Patnam Mahender Reddy : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వ్యవహారం పొలిటకల్ హాట్ టాపిక్ అయ్యింది. బూతుపురాణం కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. పొరపాటున నోరు జారానంటూ తప్పు ఒప్పుకున్నారు. పోలీసుల మనస్సు నొప్పిస్తే తనకే బాధగా ఉంటుందని, తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు సోదరులంతా తన కుటుంబసభ్యులతో సమానమని చెప్పుకొచ్చారు. పోలీసులంటే తనకు ఎనలేని గౌరవం ఉందని తెలిపారు. తాండూరు సీఐని తాను దూషించలేదని ఉదయం మహేందర్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ వాయిస్ తనది కాదని చెప్పిన ఆయన గంటల్లోనే తప్పు ఒప్పుకున్నారు.

Read More : Patnam Mahender Reddy: నా మాటలు వక్రీకరించారు: పట్నం మహేందర్ రెడ్డి

మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఓ పోలీసును ఆయన పరుషపదజాలంతో దూషించడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విషయం తెలిసిన పార్టీ హై కమాండ్ సీరియస్ అయ్యింది. పోలీసులను, ఇతర అధికారులను దుర్భాషలాడడం మంచిది కాదని పట్నంకు సూచించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య అధిపత్య పోరు ఉన్నా.. అధికారులపై దురుసగా ప్రవర్తించడాన్ని తప్పుబట్టినట్లు సమాచారం.

Read More : Patnam Mahender Reddy : : పట్నం మహేందర్ రెడ్డికి మరో షాక్.. మరో కేసు

దీంతో ఆయన ఒక మెట్టు దిగి వచ్చారు. తన వ్యాఖ్యలు బాధించినట్లు ఉన్నట్లు అయితే.. క్షమాపణలు చెబుతున్నట్లు 2022, ఏప్రిల్ 28వ తేదీ గురువారం సాయంత్రం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఉదయం ఆడియో టేప్ తనది కాదని వాదించారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.. మంత్రి కేటీఆర్ ను కలిసిన అనంతరం సీన్ మారిపోయింది. మంత్రి కేటీఆర్ సూచనలతోనే మహేందర్ రెడ్డి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. కేసును పోలీసులు ఉపసంహరించుకొనే అవకాశం కనిపిస్తుంది. క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగిందని చెప్పవచ్చు.