Bandi Sanjay: తెలంగాణ ద్రోహులను కేసీఆర్ చేరదిస్తున్నారు: బండి సంజయ్
తెలంగాణ ద్రోహులను చేరదిస్తున్న కేసీఆర్..తెలంగాణ ఉద్యమ చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

Sanjay
Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మీరంటే మీరంటు టీఆర్ఎస్.. బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. బుధవారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ద్రోహులను చేరదిస్తున్న కేసీఆర్..తెలంగాణ ఉద్యమ చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని.. తెలంగాణలో సామాన్యులు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Muralidhar Rao: కత్తులతో దాడికి దిగారు.. గోరక్షకులు దేవాలయంలోకి పరుగులు తీశారు
సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ వాస్తవాలను అవాస్తవాలుగా..అబద్ధాలను నిజంగా చెప్తున్నారని..తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ మాట వినని మీడియా సంస్థలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలకు వ్యతిరేకంగా పేపర్లు, ఛానల్స్ పెట్టుకుని ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ లో ప్రధాని మాట్లాడిన అంశాలను వక్రీకరించి ప్రజలను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించిన పేపర్లు, ఛానెళ్లపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ అన్నారు. బీజేపీని అణిచివేసేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని, వారు ఎన్ని చేసినా తెలంగాణలో బీజేపీ పాతుకుపోయిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Also read: Enforcement Directorate : మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రిని విచారిస్తున్న ఈడి అధికారులు
ఇదే మీడియా సమావేశంలో తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ..టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, బీజేపీ గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ తరుణ్ చుగ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను గద్దె దించాలని భవిస్తున్నారని..అందుకు తెలంగాణ ప్రజలకు బీజేపీ మద్దతుగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా బీజేపీ నిలుస్తుందని తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ అవినీతి ముఖ్యమంత్రి అయితే.. అలిబాబా 40 దొంగల్లా టిఆర్ఎస్ పార్టీ ఉందని ఘాటు విమర్శలు చేశారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ బీజేపీలో చెలరేగిన అసమ్మతిపై తరుణ్ చుగ్ స్పందిస్తూ.. బీజేపీ ఐక్యంగా ఉందని..అందరం కలిసి కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. పార్టీ ఐక్యంగా ఉంది..పార్టీ నేతలు క్రమశిక్షణతో ఉన్నారు.. పార్టీ అధ్యక్షుడు సంజయ్ పార్టీని నడుపుతారని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. కేసీఆర్ పీఠం కదిలింది..అందుకే మోడీ గురించి విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ వ్యతిరేక కుటమి ఏర్పాటు చేసే సత్తా కేసీఆర్ కు లేదని సంజయ్ రౌత్ అన్నారని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు సరైన సమాధానం చెబుతారని ఆయన అన్నారు.
Also read: Team KCR: మన లక్ష్యం.. బంగారు భారత్..!