Telangana Omicron Cases : తెలంగాణలో ఒమిక్రాన్ కల్లోలం.. 84కి పెరిగిన కేసులు

యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. తెలంగాణ రాష్ట్రంలోనూ కలవరపెడుతోంది. రాష్ట్రంలో.. ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. క్రమంగా..

Telangana Omicron Cases : తెలంగాణలో ఒమిక్రాన్ కల్లోలం.. 84కి పెరిగిన కేసులు

Telangana Corona Cases

Updated On : January 2, 2022 / 8:11 PM IST

Telangana Omicron Cases : యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. తెలంగాణ రాష్ట్రంలోనూ కలవరపెడుతోంది. రాష్ట్రంలో.. ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజే 5 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కి పెరిగింది. వీరిలో 32మంది కోలుకున్నారు.

Covid Restrictions : రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు, సెలూన్లు మూసివేత..

ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంపై ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించింది. కొవిడ్ నిబంధనలు పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంది.

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. క్రమంగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 274 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో మరొకరు మరణించారు.

Heart Disease : గుండె జబ్బులు రాకుండా నివారించటం ఎలాగంటే

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొవిడ్‌ ఆంక్షలను ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 10వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. జనం గుమిగూడే అన్ని కార్యక్రమాలపై ఈ నెల 10వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రజారవాణా, దుకాణాలు, మాల్స్‌లో.. మాస్క్‌, భౌతికదూరం నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. విద్యా సంస్థల్లో సిబ్బంది, విద్యార్థులు మాస్క్‌లు పెట్టుకునేలా చూడాలన్నారు. మాస్క్‌ లేకపోతే రూ.వెయ్యి జరిమానా కఠినంగా అమలు చేయాలన్నారు.