Palla : వెంటాడతాం, వేటాడతాం.. తెలంగాణలో తిరగనివ్వం

వరి కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర స్తాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇరు పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు.

Palla : వెంటాడతాం, వేటాడతాం.. తెలంగాణలో తిరగనివ్వం

Palla Rajeshwar Reddy

Updated On : November 15, 2021 / 10:10 PM IST

Palla : వరి కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర స్తాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇరు పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Raja Ravindra : “ఎవరు మీలో కోటీశ్వరులు” షో లో తొలిసారి కోటి రూపాయలు గెలుచుకున్న ఎస్ఐ

ధాన్యం సేకరణపై పాలసీ చెప్పాకే బండి సంజయ్‌ను తెలంగాణలో తిరగనిస్తామని పల్లా రాజేశ్వర్ రెడ్డి తేల్చి చెప్పారు. బండి సంజయ్‌ను తెలంగాణ రైతుల తరపున వెంటాడతాం, వేటాడతామని ఆయన అన్నారు. నల్గొండ రైతులపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలని పల్లా డిమాండ్ చేశారు. బండి సంజయ్ 100 వాహనాల్లో హైదరాబాద్ నుంచి పేరు మోసిన రౌడీలతో నల్గొండ పర్యటనకు వెళ్ళాడని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులను రెచ్చగొట్టారని మండిపడ్డారు. రైతుల కల్లాలు చూస్తున్నామని చెప్పి, రైతుల రక్తాన్ని బీజేపీ చూసిందన్నారు.

ఏ పాలసీతో ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరికి బండి సంజయ్ వెళ్లారో సమాధానం చెప్పాలని పల్లా డిమాండ్ చేశారు. బండి సంజయ్ ధర్నాలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర భారత దేశంలో ధాన్యం కొనుగోలు చేస్తూ.. దక్షిణ భారత దేశంలో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరని సంజయ్‌ను ఆయన ప్రశ్నించారు.

Post-Mortem : ఇకపై రాత్రి పూట కూడా పోస్టుమార్టం.. కేంద్రం కీలక నిర్ణయం

”రైతులపై దాడి చేయడం బీజేపీకి అలవాటుగా మారింది. గతంలో యూపీలో రైతులను కార్లతో తొక్కి చంపారు. ఇప్పుడు రైతులపై రాళ్ల దాడి చేశారు. బీజేపీకి పాలసీ ఉంటే దేశం అంతా ఒకే విధానం ఎందుకు లేదు? బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలి. నల్గొండలో రైతులపై దాడిని ఖండిస్తున్నాము. రైతులపై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్టు చేయాలి. ధాన్యం కొంటారా లేదా అనే అంశంపై కేంద్రం లేఖ విడుదల చేయాలి. బీజేపీ తన పాలసీ చెప్పే వరకు వెంటాడుతాం. వానాకాలం పంటను మొత్తం కొనాలి. యాసంగిలో వరి వెయ్యాలా వద్దా కేంద్రం చెప్పాలి” అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.