Hyderabad : వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని, ప్రియుడితో కలిసి!
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చింది. ఈ ఘటన శనివారం హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Hyderabad
Hyderabad : వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చింది. ఈ ఘటన శనివారం హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మాన్గార్ బస్తీకి చెందిన హోటల్ కార్మికుడు రోషన్(23)కు అదే బస్తీకి చెందిన లతకు గత కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం.
లతకు అదే బస్తీకి చెందిన యువరాజు (28) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. గత కొంతకాలంగా వీరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తుంది. భర్త ఇంట్లో లేని సమయంలో యువరాజు ఇంటికి వచ్చేవాడు. ఆలా కొన్ని రోజులుగా గడిచాయి. శనివారం లత ఇంట్లో యువరాజుతో ఉండగా భర్త ఇంటికి వచ్చాడు.
రోషన్ ని గమనించిన యువరాజు కదలకుండా పట్టుకోగా లత కత్తితో పొడిచి హత్యచేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకొని రోషన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
క్లూస్ టీమ్ సిబ్బంది వచ్చి రక్త నమూనాలను సేకరించారు. ఇదిలా ఉండగా ప్రియుడు యువరాజ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.