ఢిల్లీలో చక్రం తిప్పుదాం: కేంద్రంలో పెద్ద పోస్ట్‌కు కేసిఆర్

  • Published By: vamsi ,Published On : March 31, 2019 / 08:16 AM IST
ఢిల్లీలో చక్రం తిప్పుదాం: కేంద్రంలో పెద్ద పోస్ట్‌కు కేసిఆర్

Updated On : March 31, 2019 / 8:16 AM IST

టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలో పర్యటించారు.  చేవెళ్ల నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న రంజిత్ రెడ్డిని గెలిపించాలంటూ పిలుపునిచ్చిన కేటీఆర్.. లోక్ సభ ఎన్నికల తరువాత కేంద్రంలోని టాప్ పోస్ట్ కు కేసీఆర్ వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం టీఆర్ఎస్‌కు ఉందని, బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ నిలిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు 150కి పైగా సీట్లు రానున్నట్లు కేటీఆర్ జోస్యం చెప్పారు. బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీకి లాభిస్తుందని, కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ లాభం కలుగుతుందని, టీఆర్ఎస్ గెలిస్తే, తెలంగాణ గడ్డకు లాభమని చెప్పారు.