పథకాలన్నీ డోర్ డెలివరీ : జగన్

వైసీపీ అధికారంలోకి రాగానే తాము ప్రకటించిన పథకాలన్నీ అర్హులైన లబ్దిదారులకు డోర్ డెలివరీ చేస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. జాబు రావాలంటే బాబు రావాలని..ముందు వినిపించిందని..అయితే..ఐదేళ్ల తరువాత జాబు రావాలంటే బాబు పోవాలనే నినాదాలు మిన్నంటుతున్నాయని అన్నారు. 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్‌గా నియమించి రూ. 5వేలు నెలకు వేతనం ఇస్తామన్నారు. రేషన్..పెన్షన్..ఇళ్లు..ఆరోగ్య శ్రీ ఇలా ఏ సంక్షేమ పథకమైనా సరే..ఎవరి చుట్టూ తిరగాల్సినవసరం లేదు. గ్రామ వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి డోర్ డెలివరీ చేస్తారని హామీనిచ్చారు.
లక్షా 42వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే..ఐదేళ్ల కాలంలో ఒక్క పోస్టును భర్తీ చేయలేదని..కానీ బాబు కొడుక్కి మాత్రం ఉద్యోగం వచ్చిందని ఎద్దేవా చేశారు. పేదోడిని కూడా వదిలిపెట్టకుండా బాబు దోపిడి చేస్తున్నారని ఆరోపించారు జగన్. వైసీపీ అధికారంలోకి వస్తే ఇళ్లపై తీసుకున్న అప్పులను మాఫీ చేస్తామని హామీనిచ్చారు. ఉద్యోగాల కోసం ఏపీ యువకులు వలసలు వెళుతున్నారని..తాము అధికారంలోకి రాగానే 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ స్పష్టం చేశారు.
అంతేగాకుండా ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు ఆయన. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేని బాబు సర్కార్..పోలీసులకు టీఏ, డీఏలు పూర్తిగా బంద్ చేశారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఈ ఆస్తులను బాబు..లోకేష్ పంచుకుంటున్నారు..బాబు హాయంలో జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. జాబుల విషయంలో బాబు తన కొడుకుపై చూపించిన శ్రద్ధ నిరుద్యోగులపై చూపించలేదని జగన్ విమర్శలు చేశారు.