Virat Kohli: కొంత కాలంగా మెరుగైన ఆటతీరు కనబర్చకపోవడంపై విరాట్ కొహ్లీ స్పందన
తాను నెల రోజులుగా బ్యాట్ పట్టకపోవడం 10 ఏళ్ళలో ఇదే తొలిసారని చెప్పాడు. మ్యాచులు ఆడే సామర్థ్యం ఉన్నప్పటికీ అందుకు తన మనసు అంగీకరించడం లేదని కొందరు భావిస్తుండొచ్చని తెలిపాడు. ఇప్పుడు తాను మానసికంగా బలంగా ఉన్నానని చెప్పాడు. అయినప్పటికీ, ప్రతి ఒక్కరికీ హద్దులు ఉంటాయని, వాటిని గుర్తించాలని అన్నాడు. లేదంటే పరిస్థితులు మనకు ప్రతికూలంగా మారతాయని చెప్పాడు.

Virat Kohli
Virat Kohli: మైదానంలో పరుగుల వరద పారించే టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కొహ్లీ కొంత కాలంగా మాత్రం మెరుగైన ఆటతీరు కనబర్చడం లేదు. కొన్ని వారాల క్రితం ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో కనీసం ఒక్క అర్ధ సెంచరీ కొట్టలేదు. అనంతరం వెస్టిండీస్, జింబాబ్వేతో జరిగిన సిరీసుల్లో కొహ్లీకి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. దాదాపు నెల రోజుల తర్వాత ఆయన మళ్ళీ ఆడనున్నాడు. ఆసియా కప్ లో భాగంగా రేపు పాక్ తో జరిగే మ్యాచులో ఆడుతున్నాడు.
ఈ సందర్భంగా తన ఫాంపై, తాను తీసుకున్న విశ్రాంతిపై కొహ్లీ ఇవాళ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. తాను నెల రోజులుగా బ్యాట్ పట్టకపోవడం 10 ఏళ్ళలో ఇదే తొలిసారని చెప్పాడు. మ్యాచులు ఆడే సామర్థ్యం ఉన్నప్పటికీ అందుకు తన మనసు అంగీకరించడం లేదని కొందరు భావిస్తుండొచ్చని తెలిపాడు. ఇప్పుడు తాను మానసికంగా బలంగా ఉన్నానని చెప్పాడు. అయినప్పటికీ, ప్రతి ఒక్కరికీ హద్దులు ఉంటాయని, వాటిని గుర్తించాలని అన్నాడు. లేదంటే పరిస్థితులు మనకు ప్రతికూలంగా మారతాయని చెప్పాడు.
తనకు దొరికిన ఈ నెల రోజుల సమయం ఎంతో నేర్పించిందని అన్నాడు. ఫాంలో లేకపోవడంతో మానసికంగా తాను ఒత్తిడికి గురయ్యానని చెప్పడానికి వెనకాడబోనని తెలిపాడు. మానసికంగా బలహీనంగా మారడమనేది సాధారణమేనని, అయితే, మొహమాటం కారణంగా దానిపై మాట్లాడబోమని చెప్పాడు. సాధారణంగా మానసికంగా బలహీనంగా ఉన్నవారిని, శారీరక్ష సామర్థ్యం లేని వారి గురించి పట్టించుకోబోరని అన్నాడు. తాను ప్రతిరోజును పూర్తిగా ఆస్వాదిస్తూ, సంతోషంగా గడుపుతానని చెప్పాడు.
తాను మైదానంలో విఫలమవుతోన్న నేపథ్యంలో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటావని చాలా మంది తనను అడుగుతున్నారని తెలిపాడు. వారిని తాను ఓ విషయం చెబుతున్నానని, తాను ఆటను ప్రేమిస్తానని అన్నాడు. తాను టీమిండియా కోసం ఇంకా ఎంతో చేయాల్సి ఉందని చెప్పాడు. మైదానంలో పూర్తిస్థాయిలో రాణించడానికి కృషి చేస్తానని అన్నాడు. తాను ప్రస్తుతం ఎదుర్కొంటోన్న పరిస్థితిని అసాధారణ పరిస్థితిగా తానేం భావించడం లేదని చెప్పాడు. ఏది ఏమైనా జట్టును గెలిపించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని అన్నాడు.
COVID 19: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 9,520 మందికి కరోనా