చాణక్య : దసరా రిలీజ్

వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది చాణక్య టీమ్..

  • Published By: sekhar ,Published On : September 2, 2019 / 07:22 AM IST
చాణక్య : దసరా రిలీజ్

వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది చాణక్య టీమ్..

మాచో స్టార్ గోపిచంద్, మెహరీన్ జంటగా, తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమా.. ‘చాణక్య’.. గోపిచంద్ 26వ సినిమా ఇది. స్పై థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇండియా, పాకిస్థాన్ బోర్డర్‌లో గల జైసల్మేర్ పరిసర ప్రాంతాల్లో జరిగింది.

బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.. గోపిచంద్ గన్ ఫైర్ చేస్తున్న పోస్టర్‌తో సినిమాను దసరాకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

Read Also : ఐ యామ్ ది రాజా.. డిస్కోరాజా..

కెమెరా : వెట్రి, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : విశాల్ చంద్రశేఖర్, మాటలు : అబ్బూరి రవి, సమర్పణ : ATV, నిర్మాత : రామబ్రహ్మం సుంకర.