Extra Marital Affaair : వివాహేతర సంబంధం-సస్పెండైన పోలీసు కానిస్టేబుల్

పోలీసుశాఖలో పనిచేస్తూ  పెళ్లైన ఓ కానిస్టేబుల్ డిపార్ట్ మెంట్‌కు చెందిన మహిళతో    వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 

Extra Marital Affaair : వివాహేతర సంబంధం-సస్పెండైన పోలీసు కానిస్టేబుల్

Police Cop Suspended

Extra Marital Affaair :  పోలీసుశాఖలో పనిచేస్తూ  పెళ్లైన ఓ కానిస్టేబుల్ డిపార్ట్ మెంట్‌కు చెందిన మహిళతో    వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.  భార్య  పోలీసుస్టేషన్‌లో  ఫిర్యాదు చేయటంతో జిల్లాఎస్పీ ఆ కానిస్టేబుల్‌ను  ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

అనంతపురం  జిల్లా కనగానపల్లి మండలం  తగరకుంటకు చెందిన హర్షవర్ధన్ రాజు(2018 బ్యాచ్)  కానిస్టేబుల్ గా అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్నాడు.  ఇతనికి రెండేళ్ల  క్రితం కళ్యాణదుర్గం‌కు చెందిన ఓ మహిళతో  వివాహం అయ్యింది.  తల్లి తండ్రులకు ఆమె ఒక్కర్తే  సంతానం కావటంతో వివాహం సమయంలో కట్నకానుకల  కింద రూ.20లక్షల నగదు, పది తులాల బంగారం, కారు అల్లుడికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు.

కాగా…. పెళ్లికి ముందే హర్షవర్ధన్‌కు   ఏఆర్ డిపార్ట్ మెంట్  లో పని చేసే ఒక మహిళా కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది.  అది వివాహేతర  సంబంధానికి దారితీసింది.  ఆవిషయం దాచిపెట్టి హర్షవర్ధన్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.  పెళ్లైన కొన్నాళ్ల నుంచి డిపార్ట్‌మెంట్‌కు  చెందిన మహిళను ఇంటికి తీసుకు వెళ్లటం ప్రారంభించాడు.

మొదట్లో  తన చెల్లెలుగా ఆ మహిళా కానిస్టేబుల్‌ను  పరిచయం చేశాడు. కొన్నాళ్లకు వాళ్ల ప్రవర్తనపై అనుమానం వచ్చిన  భార్య భర్తను నిలదీసింది.  పోలీసు డిపార్ట్‌మెంట్‌లో  ఇవన్నీ మామూలే…. లైట్ గా తీసుకోవాలని భార్యకు చెప్పాడు.  భర్త   ప్రవర్తనతో విసిగిపోయిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్యను తిరిగి తీసుకు  రావటానికి హర్షవర్ధన్   ఏనాడు ప్రయత్నం చేయలేదు.  చివరికి పెద్దలు పంచాయతీ చేసినా ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో బాధితురాలు, ఆమె తండ్రి బ్రహ్మసముద్రం  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసు‌స్టేషన్  ఎస్సై   ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప దృష్టికి తీసుకువెళ్లారు.   ఎస్పీ ఈ కేసుపై విచారణకు ఆదేశించారు.  విచారణాధికారుల నివేదిక ఆధారంగా హర్షవర్ధన్ రాజుతో పాటు మహిళా కానిస్టేబుల్ పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.