YV Subbareddy : పబ్లిసిటీ కోసమే పవన్ వాలంటీర్లపై ఆరోపణలు : వైవీ సుబ్బారెడ్డి
ఎవరో రాసిన స్క్రిప్టు చదువుతు వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తున్న వలంటీర్లపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోం.

Pawan kalyan..YV Subbareddy
Pawan kalyan..YV Subbareddy : ఆంధప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లు, వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. పవన్ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. దీంతో వైసీపీ నేతలు పవన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీంట్లో భాగంగా వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పవన్ పై మండిపడ్డారు. పవన్ పబ్లిసిటీ కోసమే వాలంటీర్లపై ఆరోపణలు చేస్తున్నారు అంటూ విమర్శించారు.
ఎవరో రాసిన స్క్రిప్టును పవన్ చదువుతున్నారని..వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలకు సేవ చేస్తున్న వలంటీర్లపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోంఅంటూ హెచ్చరించారు.వచ్చే సెప్టెంబర్ నెలలు జగన్ విశాఖ పట్నంలో పర్యటిస్తారని తెలిపారు. బీజేపీఅంటే జగన్ కు ప్రాణం అని అన్నారు. వైసీపీ నమ్ముకున్నఅందరికి జగన్ న్యాయం చేశారని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్ వైపే ప్రజలు ఉన్నారనిఅన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తాయనే ప్రచారం జరుగుతోంది జగన్ ను గద్దె దింపాలంటే ఈ మూడుపార్టీలు ఏకం కావాలా? అంటే జగన్ అంత స్ట్రాంగ్ అని తెలుస్తోందన్నారు.