Home » Author »venkaiahnaidu
ప్రముఖ రామాయణ సీరియల్లో రాముని పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్ గురువారం(మార్చి-18,2021) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
తేడాది గాల్వన్ లోయలో సరిహద్దు వివాదం నెలకొన్నా..చైనా యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించినా ఆ దేశం నుంచే అత్యధికంగా భారత్ దిగుమతులు చేసుకున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది.
ఎనిమిది దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఐదు,ఆరు,ఏడు,ఎనిమిది దశల ఎన్నికల్లో పోటీ చేసే 148మంది అభ్యర్థుల జాబితాను గురువారం బీజేపీ విడుదల చేసింది.
వాహనాల తుక్కుకు సంబంధించిన "వెహికల్ స్క్రాపింగ్ పాలసీ"ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం(మార్చి-18,2021)పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనిపై ప్రకటన చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ గురువారం(మార్చి-18,2021) తన నామినేషన్ దాఖలు చేశారు. థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేశారు.
అమెరికా అధ్యక్షుడు తనను ఓ క్లిల్లర్ గా అభివర్ణించడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడుతున్నారు. బైడెన్ సర్కార్ పై కోపంతో రగిలిపోతున్న పుతిన్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని తమ దేశ రాయబారి అనాటోలీ ఆంటోనోవ్‌ను రష్యా వెనక్కి పిల
పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గురువారం(మార్చి-18,2021)పురూలియాలో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జీపై ప
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి సచిన్ వాజేను మహారాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోందని.. ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు.
మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం(మార్చి-17,2021) రాష్ట్రవ్యాప్తంగా 23,719కొత్త కరోనా కేసులు,84కోవిడ్ మరణాలు నమోదైనట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మంగళవారం నమోదైన కేసుల కన్నా ఇది దాదాపు 30శాతం అధికమని తెలిపింది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)బుధవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కోల్ కతాలో సీఎం మమతాబెనర్జీ..టీఎంసీ మేనిసెస్టోని విడుదల చేశారు.
ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బిర్ సింగ్ పై బదిలీ వేటు పడింది. హోం గార్డ్ డిపార్ట్మెంట్ కు డీజీగా ఆయనను బదిలీ చేసింది ప్రభుత్వం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీతా అంబానీ(57)ని ఉత్తరప్రదేశ్ లోని ప్రతిష్టాత్మక బనారస్ హిందూ యూనివర్శిటీ(BHU) విజిటింగ్ ఫ్యాకల్టీగా నియమించాలన్న ప్రతిపాదన క్యాంపస్‌లో నిరసనలకు దారి తీసింది.
Ration Cards ఆధార్ కార్డుతో లింకు కాని రేషన్ కార్డులను కేంద్రం రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వ చర్య మరీ దారుణంగా ఉందంటూ కోర్టు పేర్కొంది. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని.. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభు�
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చర్యలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. సమావేశానికి ఛత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్ సీఎంలు హాజరుకాలేదు.
జస్థాన్‌లో ఫోన్ ట్యాపింగ్ అంశంపై దుమారం చెలరేగింది. ఫోన్ ట్యాపింగ్ అంశం గతేడాది రాజస్తాన్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే ఆరోణలు వచ్చిన వి�
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ మిత్రపక్షం బీజేపీకి షాక్ ఇచ్చింది అన్నాడీఎంకే. పౌరసత్వ చట్టం(CAA)పై అన్నాడీఎంకే తన వైఖరిని మార్చుకుంది.
PM Narendra Modi భారత తయారీ కోవిడ్-19 వ్యాక్సిన్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. వ్యాక్సిన్లు కావాలంటూ వివిధ దేశాలు భారత్ ను అభ్యర్థిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇవాళ ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్‌తో వర్చువల్ గా జరిగిన సమావేశం సమయంలో ప్రధా�
ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు మరిన్ని అధికారాలను కట్టబెట్టేలా GNCTD(Government of National Capital Territory of Delhi)సవరణ బిల్లు 2021ని కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రధాన సలహాదారు ప్రదీప్ కుమార్ సిన్హా మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఓవైపు దాదాపు 10లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి సమ్మె చేస్తున్నా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.