Mobiles in India: రానున్న ఐదేళ్ళలో రూ.25 లక్షల కోట్లకు మొబైల్ తయారీ పరిశ్రమ: కేంద్ర మంత్రి

రానున్న ఐదేళ్లలో భారత మొబైల్ తయారీ పరిశ్రమ రూ.25 లక్షల కోట్లకు చేరుకుంటుందని..80 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు

Mobiles in India: రానున్న ఐదేళ్ళలో రూ.25 లక్షల కోట్లకు మొబైల్ తయారీ పరిశ్రమ: కేంద్ర మంత్రి

Ashwini

Mobiles in India: రానున్న ఐదేళ్లలో భారత మొబైల్ తయారీ పరిశ్రమ రూ.25 లక్షల కోట్లకు చేరుకుంటుందని.. అదే సమయంలో 80 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర సమాచార, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఆదివారం ఒడిశాలోని భుబనేశ్వర్ లో పర్యటించిన ఆయన..మీడియాతో మాట్లాడారు. మొబైల్ ఫోన్ల తయారీలో రానున్న రోజుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందని ఆయన అన్నారు. 5G సాంకేతికతపై గత రెండేళ్లుగా చేసిన ప్రయోగాలు పూర్తి సంతృప్తికరంగా ఉన్నాయన్న మంత్రి.. ఈ ఏడాదిలోనే భారత్ లో 5జీ సాంకేతికతను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Also read: China Pakistan: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తో ఇమ్రాన్ ఖాన్ భేటీ

పరిణామాల ప్రకారం మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఇప్పటికే రెండో స్థానంలో ఉన్న భారత్ మరికొన్ని రోజుల్లోనే ప్రపంచ అగ్రగామిగా ఎదగనుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మేక్ ఇన్ ఇండియా వంటి సంస్కరణల ద్వారా దేశంలో తయారీ పరిశ్రమలు పురుడు పోసుకుంటున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం రూ.6 లక్షల కోట్ల మార్కెట్ ఉన్న ఈరంగంలో 22 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని.. ఇదే పద్దతిలో అభివృద్ధి కొనసాగితే మార్కెట్ రూ.25 లక్షల కోట్లకు చేరి 80 లక్షల ఉద్యోగాలు వస్తాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Also read: Australia Borders: అంతర్జాతీయ పర్యాటకులను అనుమతించనున్న ఆస్ట్రేలియా

5జీ సాంకేతికత అభివృద్ధిలో మన ఇంజనీర్లు ఎంతో శ్రమించారన్నా అశ్విని వైష్ణవ్.. వారి కృషి ఫలితంగా అనుకున్నదానికంటే ముందుగానే దేశంలో 5జీని విడుదల చేసుకుంటున్నట్లు వివరించారు. ఇతర దేశాలతో పోలిస్తే.. నాణ్యమైన 4జీ సాంకేతికతను అత్యంత చవకగా తయారు చేసుకోగలిగామన్న మంత్రి 5జీ విషయంలోనూ మిగతా దేశాల కంటే నాణ్యమైన నెట్వర్క్ ను అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Also read: Chandrababu: కొత్త జిల్లాలకు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదు?: చంద్రబాబు