Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు | Konaseema

Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు

అమలాపురం అల్లర్ల కేసులో అరెస్టైన కీలక నిందితుడు అన్నెం సాయిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 309 కింద మరొక కేసు నమోదు చేశారు. ఈ నెల 20 న  జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు

Konaseema :  అమలాపురం అల్లర్ల కేసులో అరెస్టైన కీలక నిందితుడు అన్నెం సాయిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 309 కింద మరొక కేసు నమోదు చేశారు. ఈ నెల 20 న  జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

కోనసీమ ముద్దు అంబేద్కర్ వద్దు అని నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో సాయి ఒంటి పై పెట్రోల్ పోసుకున్నాడు. కాగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గోన్న 19 మంది పై కూడా పోలీసులు  ఐపీసీ సెక్షన్  341, 188 ల తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న అగ్గి రాజేసింది. పేరు మార్పుని నిరసిస్తూ జిల్లా కేంద్రం అమలాపురంలో ఈనెల 24న కోనసీమ జిల్లా సాధన సమితి తలపెట్టిన భారీ ర్యాలీ విధ్వంసకాండకు దారితీసింది. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మూడు బస్సులను తగులబెట్టారు.

ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేలా ముందు జాగ్రత్తగా కోనసీమలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది ప్రభుత్వం.   దీంతో కోనసీమ జిల్లాలోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కష్టం వచ్చి పడింది. ఇంటర్నెట్ బంద్ కావడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.

చివరికి గోదావరి నది ఒడ్డున నిలబడి పని చేసుకుంటున్నారు. అక్కడ ఇంటర్నెట్ సర్వీస్ వస్తుండటంతో ల్యాప్ ట్యాప్ లు అక్కడికి తీసుకెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. అమలాపురంలో అల్లర్ల తర్వాత జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. గత మూడు రోజులుగా ఇంటర్నెట్ సర్వీస్ కట్ చేశారు. దీంతో ముక్తేశ్వరంలోని ఐటీ ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు.

×