ANDHRA PRADESH: ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

ఎన్టీఆర్ జిల్లా, చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో గరుడ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికిపైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది.

ANDHRA PRADESH: ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

ANDHRA PRADESH: ఆంధ్ర ప్రదేశ్‌లో ఆర్టీసీకి చెందిన గరుడ బస్సు బోల్తా పడింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. ఎన్టీఆర్ జిల్లా, చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో గరుడ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికిపైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యయి.

Wipro: ఫ్రెషర్లకు సగం జీతాలు కట్ చేసిన విప్రో.. అన్యాయమంటున్న ఐటీ ఉద్యోగుల సంఘం

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీ 16 జడ్ 0599 నెంబర్ గల బస్సు విజయవాడ నుంచి మియాపూర్ (హైదరాబాద్) వెళ్తుండగా, చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గరకు వచ్చేసరికి హెడ్ లైట్లలో సమస్య తలెత్తింది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సును నియంత్రించేందుకు డ్రైవర్ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. బస్సు ఒక పక్కకు ఒరుగుతూ బోల్తా పడింది. దీంతో బస్సులోని ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది, హైవే పోలీసులు స్పందించారు. బస్సు అద్దాలు పగులగొట్టి, అందులోని ప్రయాణికులను బయటకు తీశారు.

క్షతగాత్రులను సమీపంలోని జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్న ప్రయాణికులను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులను మరో బస్సు ఏర్పాటు చేసి హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారణ జరుపుతున్నారు.