IPL2022 DC Vs LSG : ఉత్కంఠపోరులో ఢిల్లీపై లక్నో విజయం.. రెండో స్థానానికి రాహుల్ సేన

చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీని చిత్తు చేసింది లక్నో. తద్వారా తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది.

IPL2022 DC Vs LSG : ఉత్కంఠపోరులో ఢిల్లీపై లక్నో విజయం.. రెండో స్థానానికి రాహుల్ సేన

Ipl2022 Dc Vs Lsg

IPL2022 DC Vs LSG : ఐపీఎల్ 2020 సీజన్ 15లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీని చిత్తు చేసింది లక్నో. తద్వారా తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. లక్నో నిర్దేశించిన 196 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ.. 189/7 పరుగులకే పరిమితమైంది. దీంతో 6 పరుగుల తేడాతో లక్నో జట్టు గెలుపొందింది.

ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్ (44), అక్షర్ పటేల్(42*), మిచెల్ మార్ష్(37), రోవ్ మెన్ పావెల్(35) రాణించారు. కుల్‌దీప్‌ (16*) ఫర్వాలేదనిపించగా.. పృథ్వీ (5), వార్నర్ (3), లలిత్ యాదవ్ (3), శార్దూల్ (1) విఫలమయ్యారు.

IPL2022 Mumbai vs Rajasthan : రోహిత్‌కు బర్త్‌డే గిఫ్ట్.. ఎట్టకేలకు ముంబై బోణీ

లక్నో బౌలర్లలో మోహ్ సిన్ ఖాన్ అదరగొట్టాడు. కేవలం 16 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, క్రిష్ణప్ప గౌతమ్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ విజయంతో లక్నో జట్టు (14) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో టాపార్డర్ సత్తా చాటింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా దంచికొట్టారు. హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 4 ఫోర్లు, 5 సిక్సులున్నాయి. వన్ డౌన్ లో వచ్చిన దీపక్ హుడా 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 52 పరుగులు చేశాడు.

అంతకుముందు ఓపెనర్ క్వింటన్ డికాక్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 23 పరుగులు చేశాడు. చివర్లో ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ 17 పరుగులు సాధించాడు. లక్నో కోల్పోయిన మూడు వికెట్లు ఢిల్లీ మీడియం పేసర్ శార్దూల్ ఠాకూర్ ఖాతాలోకి వెళ్లాయి.

IPL2022 RCB Vs GT : బెంగళూరుని చిత్తు చేసిన గుజరాత్.. ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం..!

గత మ్యాచ్‌లో కోల్‌కతా మీద గెలిచిన ఢిల్లీ ఆ ఊపును కొనసాగించలేకపోయింది. ఇప్పటివరకు టోర్నీలో లక్నో జట్టు 10 మ్యాచులు ఆడింది. 7 మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఇక ఢిల్లీ 9 మ్యాచులు ఆడింది. అందులో నాలుగు విజయాలు, ఐదు ఓటములు ఉన్నాయి. ఢిల్లీ(8 ) పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు : కేఎల్‌ రాహుల్(కెప్టెన్)‌, క్వింటన్‌ డికాక్‌, దీపక్‌ హుడా, మార్కస్‌ స్టొయినిస్‌, ఆయుష్‌ బదోని, కృనాల్‌ పాండ్య, జేసన్‌ హోల్డర్‌, మొహిసిన్ ఖాన్‌, కృష్ణప్ప గౌతమ్‌, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్‌.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : డేవిడ్‌ వార్నర్‌, పృథ్వీ షా, మిచెల్‌ మార్ష్‌, రిషబ్‌ పంత్‌, లలిత్‌ యాదవ్‌, రోమన్‌ పావెల్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, చేతన్‌ సకారియా.