Railway SP Anuradha : కాల్పులు జరిపింది వాళ్లే.. సికింద్రాబాద్ అల్లర్లపై రైల్వే ఎస్పీ వివరణ

రైల్వే స్టేషన్ లో ఇంధన డిపో, ఇంజన్లకు మంటలు వ్యాపించి ఉంటే తీవ్ర విధ్వంసం చోటుచేసుకుని ఉండేదన్నారు. ప్రమాదాన్ని నివారించడానికే ఆర్పీఎఫ్ కాల్పులు జరిపిందని స్పష్టం చేశారు.

Railway SP Anuradha : కాల్పులు జరిపింది వాళ్లే.. సికింద్రాబాద్ అల్లర్లపై రైల్వే ఎస్పీ వివరణ

Railway SP Anuradha : సైన్యంలో నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ అగ్గి రాజేసింది. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని నిరసిస్తూ యువత ఆందోళనబాట పట్టింది. పలు చోట్ల ఆందోళనలు హింసకు దారితీశాయి. ఆందోళనకారులు రైల్వే ఆస్తులను టార్గెట్ చేశారు. రైల్వే స్టేషన్లలో విధ్వంసానికి పాల్పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. పరిస్థితి అదుపు తప్పుడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో ఒకరు మరణించారు, కొందరు గాయపడ్డారు.

Secunderabad Station Mastermind : సికింద్రాబాద్ విధ్వంసం.. సుబ్బారావుపై పోలీసుల ప్రశ్నల వర్షం

ఈ ఘటనపై రైల్వే ఎస్పీ అనురాధ వివరణ ఇచ్చారు. ఆర్మీ ఆశావహులకు ట్రైనింగ్ ఇచ్చిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల సలహా మేరకే రైల్వే స్టేషన్ పై దాడి చేశారని వెల్లడించారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పై దాడి జరుగుతుందని తాము ఊహించలేదన్నారు.(Railway SP Anuradha)

Secunderabad Violence Loss : సికింద్రాబాద్ విధ్వంసం.. రైల్వేశాఖకు రూ.12కోట్ల ఆస్తి నష్టం

నిరసనకారులు ఈ నెల 16నే వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పరస్పరం సమాచారం అందించుకున్నారని ఎస్పీ వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, ఈ కేసులో ఇప్పటిదాకా 46 మందిని అరెస్ట్ చేశామన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కాగా, రైల్వే స్టేషన్ లో ఇంధన డిపో, ఇంజన్లకు మంటలు వ్యాపించి ఉంటే తీవ్ర విధ్వంసం చోటుచేసుకుని ఉండేదన్నారు. ప్రమాదాన్ని నివారించడానికే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కాల్పులు జరిపిందని ఎస్పీ అనురాధ స్పష్టం చేశారు. రైల్వే పోలీసులు మొత్తం 20 రౌండ్లు కాల్పులు జరిపారని తెలిపారు. దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని, మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.

భారత సాయుధ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాలిక ఉద్యోగ నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ విధానం అగ్గి రాజేసింది. తీవ్ర హింసకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు భగ్గుమంటున్నాయి. ఆర్మీ ఆశావహులు నిరసనలకు దిగుతూ పలు రైళ్లకు నిప్పంటించారు.

Agnipath : కేవలం అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్ మెంట్..సాధారణ రిక్రూట్ మెంట్ లేదు : రక్షణ శాఖ

‘అగ్నిపథ్’ ద్వారా నాలుగేళ్లు మాత్రమే ఆర్మీలో పని చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. యువతలో తీవ్ర ఆగ్రహానికి ఇదే ప్రధాన కారణం అవుతోంది. ఈ నిబంధనను నిరసిస్తూ యువత రోడ్డెక్కింది. ఆందోళన బాట పట్టింది. పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో నిరసనకారులు రైళ్లకు నిప్పంటించారు. హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

Sai Defence Academy : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం.. పోలీసుల అదుపులో దాడుల సూత్రధారి?

పెద్దఎత్తున తరలివచ్చిన ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడ్డారు. రైళ్లకు నిప్పుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.

కాగా.. అగ్నిప‌థ్‌పై రేకెత్తిన అనుమానాల‌ను నివృత్తి చేసేందుకు భార‌త త్రివిధ ద‌ళాధిప‌తులు ఆదివారం మీడియా ముందుకు వ‌చ్చారు. ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో భేటీ అనంత‌రం వారు మాట్లాడుతూ అగ్నిప‌థ్ ప‌థ‌కానికి సంబంధించి ప‌లు కీల‌క అంశాలను ప్ర‌క‌టించారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ‘అగ్నివీర్’ మ‌ర‌ణిస్తే బాధిత కుటుంబానికి రూ.1 కోటి ప‌రిహారం ఇవ్వ‌నున్న‌ట్లు వారు ప్ర‌క‌టించారు. అగ్నిప‌థ్ పై ఏకంగా రెండేళ్ల పాటు అధ్య‌య‌నం చేశాకే ఈ ప‌థ‌కానికి శ్రీకారం చుట్టిన‌ట్లు తెలిపారు. అనుభ‌వానికి, యువ‌శక్తికి ప్రాధాన్యం ఇస్తూ ఈ ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేశామ‌ని వెల్ల‌డించారు.