Jagadish Reddy: సీఎం కేసీఆర్ ముందుచూపుతో సూర్యపేట అభివృద్ధి చెందింది: మంత్రి జగదీష్ రెడ్డి

సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమంతో సూర్యాపేటలో మాకు నీటి బాధలు పోయాయని ఆయన అన్నారు.

Jagadish Reddy: సీఎం కేసీఆర్ ముందుచూపుతో సూర్యపేట అభివృద్ధి చెందింది: మంత్రి జగదీష్ రెడ్డి

Jagadish Reddy

Jagadish Reddy: సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరించడంతోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి కష్టాలు తప్పి.. వ్యవసాయంలో అగ్రగామిగా దూసుకుపోతున్నామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ తో సూర్యాపేటలో ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందిస్తున్నామని అన్నారు. నీళ్లను ఒక వస్తువుగా, సెంటిమెంట్ గా చూస్తున్నామని ఎంట్రీ అన్నారు. నీళ్లే ప్రాణం, నీళ్లు లేనిదే ప్రాణి లేదు, నీళ్లు ఉన్న భూమి పై మాత్రమే ప్రాణి మనగడ సాగిస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మూసి నది ఒడ్డున మనం ఉన్నాం కానీ మూసి నది ఆనవాళ్లు లేవని మంత్రి అన్నారు. మూసీ నదిని నాశనం చేసింది మన మానవ జాతియేనని.. నదికి ఎప్పుడు మనమే అడ్డం పోయి నదులను నాశనం చేస్తున్నామని జగదీష్ రెడ్డి అన్నారు. మనుషుల అతి స్వార్థం వలన ప్రకృతి నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also read: Car Donate : తిరుమల శ్రీవారికి విరాళంగా రూ.17 లక్షల విలువైన కారు

దేశంలో మురుగు నీరు తాగిన ఏకైక పట్టణము మా సూర్యాపేట పట్టణమేనని..నీళ్లు కొనుక్కుని త్రాగిన ఏకైక పట్టణం కూడా మా సూర్యాపేట పట్టణమేనని మంత్రి జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కేసీఆర్ వచ్చాక సూర్యాపేటలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమంతో సూర్యాపేటలో మాకు నీటి బాధలు పోయాయని ఆయన అన్నారు. ఇప్పుడు ప్రతి ఇంటికి త్రాగు నీరుతో పాటు..వ్యవసాయానికి నిరంతరం సాగు నీరు కూడా అందిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి వివరించారు. 2014 ముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 2 లక్షల మంది ప్లోరోసిస్ బారిన పడ్డారన్నా మంత్రి..2021 నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్లోరోసిస్ కేస్ కూడా నమోదు కాలేదంటే అది సీఎం కేసీఆర్ చూపిన చొరవేనని మంత్రి అన్నారు.

Also read: MLA Roja: పవన్‌ను తొక్కేయాల్సిన అవసరం మాకు లేదు – ఎమ్మెల్యే రోజా

వ్యవసాయ రంగం పై ఆధారపడిన సూర్యపేట జిల్లాలో ఒకప్పుడు పంటలు పండక..ప్రజలు వలస పోయేవారని..అయితే ఇప్పుడు సాగు నీరు పుష్కలంగా ఉండడంతో దేశంలోనే అత్యధికంగా వరి పండించిన జిల్లాగా సూర్యాపేట నిలిచిందని మంత్రి అన్నారు. రికార్డ్ స్థాయిలో వ్యవసాయ రంగంలో సూర్యాపేట దూసుకుపోతుందన్న మంత్రి జగదీష్ రెడ్డి.. వలసలు వాపసు వచ్చాయని అన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణం తో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందని ఆయన తెలిపారు. వానలు వాపసు రావాలి.. కోతులు అడవులకు పోవాలని కేసీఆర్ అనేవారని.. వానల కోసం చెట్లను పెంచుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏ రహదారిలోకి పోయినా పచ్చని చెట్లు కనిపిస్తున్నాయని మంత్రి అన్నారు. నదుల సంరక్షణకు సీఎం కేసీఆర్ పాటు పడ్డారని నదుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also read: Telangana : తెలంగాణలో ప్రశాంత్ కిశోర్.. పీకే టీం సర్వే