Corona Cases : దేశంలో కొత్తగా 12 వేల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. కొత్తగా 12,729 కరోనా కేసులు నమోదు కాగా.. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు 3,43,33,754మంది కరోనా బారినపడ్డారు.

Corona Cases 11zon
Corona Cases : దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. కొత్తగా 12,729 కరోనా కేసులు నమోదు కాగా.. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు 3,43,33,754మంది కరోనా బారినపడ్డారు. ఇక ప్రస్తుతం దేశంలో 1,48,922 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 4,59,873 మంది కరోనాతో మరణించగా, 3,37,24,959 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
చదవండి : AP Corona : ఏపీలో కొత్తగా 301 కరోనా కేసులు.. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో..
కాగా, 2020, మార్చి తర్వాత యాక్టివ్ కేసుల రేటు కనిష్టానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.43 శాతంగా ఉండగా, కరోనా రికవరీ రేటు 98.23 శాతానికి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 221 మంది మరణించగా, 12,165 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 1,07,70,46,116 కరోనా డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.