Indian Oil: రష్యా నుంచి కారుచౌకగా ముడిచమురు కొనుగోలు చేసిన ఇండియన్ ఆయిల్

ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు కొరత ఏర్పడి పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో ఇండియన్ ఆయిల్ రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది

Indian Oil: రష్యా నుంచి కారుచౌకగా ముడిచమురు కొనుగోలు చేసిన ఇండియన్ ఆయిల్

Crude

Indian Oil: భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ రష్యా నుంచి కారుచౌకగా ముడిచమురును కొంగలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు కొరత ఏర్పడి పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో ఇండియన్ ఆయిల్ రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా యుక్రెయిన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ముడిచమురు కొరత ఏర్పడింది. యూరోప్ సహా ఆసియాలోని కొన్ని దేశాలు రష్యా నుంచి అధిక భాగం ముడిచమురు దిగుమతి చేసుకుంటాయి. అయితే యుక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధించిన ఆయా దేశాలు ఈమేరకు ముడిచమురు సరఫరా సహా రష్యాతో ఉన్న ఇతర వ్యాపార సంబంధాలను వదులుకున్నాయి.

Also read: Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య 22వ రోజు భీకర పోరు.. ఐసీజే తీర్పును తిరస్కరించిన పుతిన్

అయితే యుద్ధం కారణంగా రష్యా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది. విదేశీ పెట్టుబడులు సైతం వెనక్కువెళ్ళిపోయాయి. అయినప్పటికీ యుక్రెయిన్ పై యుద్ధం కోనసాగిస్తునే ఉంది రష్యా. అయితే యుద్ధం కొనసాగించాలంటే ఆర్ధికంగా పుంజుకోవాలని భావించిన రష్యా.. ఆమేరకు దేశంలోని వనరులను చౌకబేరానికి పెట్టింది. ఈక్రమంలోనే ముడిచమురును తక్కువ రేటుకు ఇస్తామంటూ భారత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది రష్యా ప్రభుత్వం. ఇదే అదునుగా భావించిన భారత చమురు సంస్థలు..ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. అయితే అందరికంటే ముందుగా ఇండియన్ ఆయిల్ సంస్థ స్పందించింది. రష్యా నుంచి 3 మిలియన్ బ్యారెళ్ల యురల్స్ ముడిచమురును బ్రెంట్ ధర కంటే $20-25 డాలర్ల తక్కువకు కొనుగోలు చేసింది.

Also read:Samsung: భారత్ లో గెలాక్సీ గో, బుక్ 2 సిరీస్, బుక్ 2 బిజినెస్ ల్యాప్‌టాప్‌లు విడుదల చేసిన శాంసంగ్

ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $100 డాలర్లుగా ఉంది. దీంతో ఇండియన్ ఆయిల్ కొనుగోలు చేసిన యురల్స్ క్రూడ్ ఒక బ్యారెల్ పై సరాసరి $22 డాలర్లు డిస్కౌంట్ వచ్చినా..బ్యారెల్ ధర $78 డాలర్లుగా ఉండనుంది. ఇండియన్ ఆయిల్ కొనుగోలు చేసిన ఈ 3 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును మరో రెండు నెలల్లో.. అనగా మే నెల నుంచి భారత్ కు ఎగుమతి చేయనుంది రష్యా. అయితే ఇంత భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేసినా.. భారత్ లో చమురు ధరలపై ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా చమురు సరఫరాపై సందిగ్తత నెలకొన్న సమయంలో కొంతలో కొంత మేర దేశీయ అవసరాలు మాత్రం తీరుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also read: UAE Ship : ఇరాన్‌ సమీపంలో మునిగిపోయిన UAE కార్గో షిప్‌..ఓడలో 30 మంది సిబ్బంది

యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆపాలంటూ ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యాతో పాటు ఆదేశానికి మద్దతునిస్తున్న మిత్ర దేశాలపైనా ఆంక్షలు విధించాయి. గత 21 రోజులుగా యుక్రెయిన్ పై భీకర దాడులు చేస్తున్న రష్యా పై ప్రపంచ దేశాలు ఆంక్షలు కొనసాగిస్తున్న సమయంలో ఇండియన్ ఆయిల్ సంస్థ ఈ వ్యాపార ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అయితే రష్యా పై కఠిన ఆంక్షలు విధించిన అమెరికా సైతం భారత్ – రష్యా చమురు ఒప్పందాన్ని తప్పుబట్టలేదు. దీన్ని తాము వ్యాపార కోణంలో మాత్రమే చూస్తున్నామని.. ఆంక్షల ఉల్లంఘనగా చూడడం లేదని అమెరికా విదేశాంగశాఖ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.

Also read:Airport Baggage: ఐపీఎస్ అధికారి బ్యాగులో అవి చూసి అవాక్కైనా ఎయిర్ పోర్ట్ సిబ్బంది